RCB 18 : ఆర్సీబీకి 18 భ‌లే కుదిరింది.. జెర్సీ నెంబ‌ర్, సీజ‌న్, డేట్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

RCB 18 : ఆర్సీబీకి 18 భ‌లే కుదిరింది.. జెర్సీ నెంబ‌ర్, సీజ‌న్, డేట్..!

 Authored By ramu | The Telugu News | Updated on :4 June 2025,3:00 pm

ప్రధానాంశాలు:

  •  RCB 18 : ఆర్సీబీకి 18 భ‌లే కుదిరింది.. జెర్సీ నెంబ‌ర్, సీజ‌న్, డేట్..!

RCB 18 : విరాట్ కోహ్లీ కల నెరవేరింది. ఐపీఎల్ మొదటి సీజన్ నుంచి.. ఇప్పటివరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులోనే ఉన్న కోహ్లీ, 17 సీజన్లుగా ఒక్కసారి కూడా ట్రోఫీని అందించలేకపోయాడు ర‌న్ మెషీన్. అయినా సరే.. ఫ్యాన్స్ మాత్రం ఆర్సీబీని, విరాట్ కోహ్లీని సపోర్ట్ చేస్తూనే ఉంటారు. వారందరి కోసమైనా.. ఐపీఎల్ కప్పు కొట్టాలని కోహ్లీ ప్రతిసారి అంటూనే ఉంటాడు. కానీ 17 సంవత్సరాలుగా ఓడిపోతూ వస్తున్నారు.

RCB 18 ఆర్సీబీకి 18 భ‌లే కుదిరింది జెర్సీ నెంబ‌ర్ సీజ‌న్ డేట్

RCB 18 : ఆర్సీబీకి 18 భ‌లే కుదిరింది.. జెర్సీ నెంబ‌ర్, సీజ‌న్, డేట్..!

RCB 18 సెంటిమెంట్..

పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన ఉత్కంఠ బరితమైన ఫైనల్ మ్యాచ్ లో ఆర్సీబీ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది. ఆ స్కోరు పంజాబ్ చేధించ‌లేక‌పోయింది. దాంతో ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారిగా కప్పు కొట్టింది ఆర్సీబీ​. ఈ సాల కప్ నమ్దే.. అంటూ ఏళ్లకు ఏళ్లు ఊరించి ఎట్టకేలకు టైటిల్ కైవసం చేసుకుంది.

దీంతో ఆర్సీబీ ఫ్యాన్స్ 18 ఏళ్ల కలను జట్టు నిజం చేసింది. పంజాబ్‌ కింగ్స్‌ తో జరిగిన ఫైనల్‌లో 6 పరుగుల తేడాతో విజయం సాధించింది ఆర్సీబీ. అయితే ఇక్కడ 18 వారికి బాగా క‌లిసి వ‌చ్చింది. సీజ‌న్ 18, కోహ్లీ జెర్సీ 18 అలానే ఐపీఎల్ ఫైన‌ల్ తేది కూడా 18 వ‌స్తుంది. ( 03+06+2025).. ఇలా మొత్తానికి ఆర్సీబీ 18 సెంటిమెంట్‌తో క‌ప్ ఎగ‌రేసుకుపోయింది..

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది