Virat Kohli : అవార్డ్ అందుకున్నాక కోహ్లీ అంతలా ఉరుకులు పెట్టాడు.. కారణం ఏంటి?
Virat Kohli : రన్ మెషీన్ విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. కెరీర్‌లో ఎన్నో రికార్డులు చెరిపేసిన కోహ్లీ ఇక మూడేళ్లు ఫామ్ లేక నానా ఇబ్బందులు పడ్డాడు. మూడేళ్లుగా సెంచరీ చేయలేకపోయిన విరాట్ కోహ్లీ, ఆఫ్ఘాన్‌పై 71వ సెంచరీ అందుకున్నాడు. .. అయితే మంచి సెంచరీ కొట్టినా కూడా ఎక్కడో ఏదో అసంతృప్తి. ఆఫ్ఘాన్ వంటి పసికూనపై సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ, ఆ తర్వాత రెండు మ్యాచుల్లో ఫెయిల్ అవ్వడంతో నిజంగా […]
Virat Kohli : రన్ మెషీన్ విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. కెరీర్‌లో ఎన్నో రికార్డులు చెరిపేసిన కోహ్లీ ఇక మూడేళ్లు ఫామ్ లేక నానా ఇబ్బందులు పడ్డాడు. మూడేళ్లుగా సెంచరీ చేయలేకపోయిన విరాట్ కోహ్లీ, ఆఫ్ఘాన్‌పై 71వ సెంచరీ అందుకున్నాడు. .. అయితే మంచి సెంచరీ కొట్టినా కూడా ఎక్కడో ఏదో అసంతృప్తి. ఆఫ్ఘాన్ వంటి పసికూనపై సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ, ఆ తర్వాత రెండు మ్యాచుల్లో ఫెయిల్ అవ్వడంతో నిజంగా ఫామ్‌లోకి వచ్చాడా? లేక అది గాలివానలా వచ్చిన ఇన్నింగ్స్ మాత్రమేనా? అని అందరు అనుకున్నారు. కాని ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు.
హాఫ్ సెంచరీతో ఆకట్టుకొని జట్టును విజయతీరాలకు చేర్చిన కోహ్లీ, చివరి ఓవర్లో 11 పరుగులు అవసరమైన స్థితిలో తొలి బంతికే భారీ సిక్సర్ బాది టెన్షన్ తగ్గించాడు. కోహ్లీ ఆట తీరుకి ఆయన ‘మోస్ట్ ఎనర్జిటిక్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును అందుకున్నాడు.మరి చాలా రోజుల తర్వాత అవార్డ్ దక్కిందనే ఉత్సాహమో లేదంటే ఎనర్జిటిక్ ప్లేయర్ దక్కిందనే సంతోషమో కాని కోహ్లీ స్ప్రింటర్‌లా పరిగెడుతూ తన జట్టును చేరుకున్నాడు. అతను చేసిన ఈ పని చూసి యుజ్వేంద్ర చాహల్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ తెగ నవ్వుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వీడియోకి నెటిజన్స్ స్టన్నింగ్ కామెంట్స్ పెడుతున్నారు.
Virat Kohli : పరుగు పెట్టాడు..
హైదరాబాద్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20లో 6 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకున్న భారత జట్టు, ఈ ఏడాది టీ20ల్లో 21వ విజయాన్ని అందుకుంది. ఒకే ఏడాదిలో అత్యధిక విజయాలు అందుకున్న జట్టుగా ఆవిర్భవించింది టీమిండియా. ఇంతకుముందు 2018లో పాకిస్తాన్ 20 టీ20ల్లో గెలవగా టీమిండియా ఆ రికార్డును తుడిచిపెట్టేసింది. 2022లో ఇంకా 3 నెలల సమయం ఉండడంతో భారత జట్టు కనీసం 10-15 టీ20 మ్యాచులు ఆడబోతుండడం విశేషం. పూర్తి స్థాయి కెప్టెన్‌గా రోహిత్ శర్మకు ఇది వరుసగా 9వ ద్వైపాక్షిక సిరీస్. అంతకుముందు తాత్కాలిక సారథిగా ఓ సిరీస్ గెలిచిన రోహిత్, వరుసగా 10 సిరీస్‌లు గెలిచిన భారత కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ రికార్డును సమం చేశాడు.