Virat Kohli : పుష్ప స్టైల్‌లో తగ్గేదే లే అంటూ సైగ చేసిన విరాట్ కోహ్లీ.. వీడియో వైరల్
Virat Kohli : ప్రస్తుతం అందరికి పుష్ప మానియా పట్టుకుంది. ఈ సినిమాలోని డైలాగ్స్, సాంగ్స్‌కి సిగ్నేచర్ స్టెప్స్ వేస్తూ అలరిస్తున్నారు. ముఖ్యంగా క్రికెటర్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు. తాజాగా విరాట్ కోహ్లీ గ్రౌండ్‌లో తగ్గేదే లే అన్నట్టు సైగ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇటీవల క్రికెటర్ రవీంద్ర జడేజా శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లో తగ్గేదే లే అంటూ బన్నీ మేనరిజాన్ని ఇమిటేట్ చేయగా ఆ వీడియో తెగ వైరల్ అయ్యింది. తాజాగా శ్రీలంకతో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా తగ్గేదే లే అంటూ మేనరిజంతో ఆకట్టుకున్నాడు. కోహ్లీ చేసిన ఈ పనిని గ్రౌండ్‌లోని కెమెరాలు రికార్డు చేశాయి. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
విరాట్ కోహ్లీ తన వందో టెస్ట్ మ్యాచ్ లో విజయం సాధించడంతో అటు క్రికెట్ అభిమానులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప ది రైజ్ చిత్రం పాన్ ఇండియా మూవీ గా విడుదల అయ్యి ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పటి వరకు పలువురు ప్రముఖులు, క్రికెటర్లు, సినీ పరిశ్రమ కి చెందిన వారు పుష్పరాజ్ పాత్ర లాగా ఇమిటేట్ చేస్తూ తమ అభిమానం చాటుకున్నారు. అయితే విరాట్ చేసిన సిగ్నేచర్ మూమెంట్ పట్ల ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పుష్ప ది రూల్ చిత్రం కోసం ఎదురు చూస్తున్నట్లు అభిమానులు చెబుతున్నారు.

virat kohli steps video viral
Virat Kohli : కోహ్లీ తగ్గేదే లే..
మొహాలీ వేదికగా వందో టెస్ట్ ఆడుతున్న కోహ్లి ఫస్ట్ ఇన్నింగ్స్ లో సెంచరీ సాధిస్తాడని భావించిన అభిమానులకు నిరాశే ఎదురైన సంగతి తెలిసిందే. మైల్ స్టోన్ మ్యాచులో హాఫ్ సెంచరీ దిశగా సాగుతున్న.. విరాట్ కోహ్లీని లసిత్ ఎంబుల్దెనియా బోల్తా కొట్టించాడు. మైదానంలో పరుగుల వరద పారించే కోహ్లీ బ్యాట్ నుంచి రెండున్నరేళ్లుగా సెంచరీ రాలేదు. 2019లో ఈడెన్ గార్డెన్స్‌లో కోహ్లీ తన చివరి సెంచరీని సాధించాడు. దీంతో, మైల్ స్టోన్ మ్యాచులోనైనా సెంచరీ బాది.. ఆ కొరతను తీరుస్తాడని ఫ్యాన్స్ భావించారు. కానీ.. ఫస్ట్ ఇన్నింగ్స్ లో కోహ్లీ ఔటవ్వడంతో వారికి నిరాశ తప్పలేదు.
Congratulations @imVkohli on your 100th Test and @BCCI on the Grand Victory! ???????????????? Our Rockstar @imjadeja special all through the match ???????? pic.twitter.com/04yaWzVEyD
— Mythri Movie Makers (@MythriOfficial) March 6, 2022