Vizag YMCA Swetha : శ్వేత తల్లికి వచ్చిన కష్టం మరెవరికీ రావొద్దు.. వీడియో | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Vizag YMCA Swetha : శ్వేత తల్లికి వచ్చిన కష్టం మరెవరికీ రావొద్దు.. వీడియో

 Authored By kranthi | The Telugu News | Updated on :1 May 2023,5:00 pm

Vizag YMCA Swetha : భర్త లేకపోయినా కూతురును పెంచి పెద్ద చేసింది. మంచి సంబంధం అనుకొని దగ్గరుండి పెళ్లి చేసి పంపించింది. ఇంకో నాలుగు నెలల్లో మనవడో, మనవరాలో పుడితే ఎత్తుకొని ఆడుకోవాలని అనుకుంది. కానీ.. తానొకటి తలిస్తే, దైవం మరొకటి తలిచాడు. కూతురును, తన బిడ్డను దూరం చేశాడు. ఆమె గాథ విన్న ప్రతిఒక్కరు దేవుడా.. ఎందుకు ఈమెకు ఇంత కష్టాన్ని కల్గించావు అని అనుకోకుండా ఉండరు. ఎందుకంటే ఆమె మొదటి నుంచి పడ్డ కష్టాలు అటువంటివి. ఇప్పుడు ఒంటరి అయిన పరిస్థితి.

Visakha Swetha Case : విశాఖ శ్వేత కేసులో మరో సంచలనం - 10TV Telugu

శ్వేత తల్లి రమ. సొంతూరు శ్రీకాకుళం అయినప్పటికీ విశాఖలోనే ఉంటుంది. రైల్వేలో ఉద్యోగం చేస్తోంది. శ్వేత తండ్రి ఆమె చిన్నప్పుడే చనిపోవడంతో శ్వేతను ఆమె పెంచి పెద్ద చేసింది. ఇద్దరూ ఇంట్లో ఉండేవారు. ఒకరిపై మరొకరికి విపరీతమైన ప్రేమ. తల్లిదగ్గరే ప్రేమను పొందింది శ్వేత. శ్వేతకు అక్క ఉన్నా కూడా ఇప్పుడు శ్వేత తల్లి ఒంటరి అయింది. శ్వేతను చూసేందుకు అక్క కూడా రాలేదు. ఎందుకంటే.. శ్వేత అక్క స్వాతిని చిన్నప్పుడే తన మేనత్తకు దత్తత ఇచ్చారు.

Vizag YMCA rk beach swetha incident news

Vizag YMCA rk beach swetha incident news

Vizag YMCA Swetha : తల్లికి చెప్పకుండానే మేనత్తకు దత్తత ఇచ్చిన శ్వేత తండ్రి

కనీసం తల్లికి కూడా చెప్పకుండా.. శ్వేత తండ్రి తన అక్క స్వాతిని దత్తత ఇచ్చాడట. అప్పటి నుంచి తల్లి మీద కోపం పెంచుకొని తల్లిని చూడటానికి కూడా రాలేదట స్వాతి. ఇప్పుడు చెల్లి శ్వేత చనిపోయినా కూడా స్వాతి తనను చూడటానికి రాలేదట. దానికి కారణం.. శ్వేత మేనత్తేనట. ఆమెను రానివ్వదట. తన తల్లి ఒక శత్రువు అని స్వాతికి నూరిపోసిందట. చిన్నప్పుడే పెద్ద బిడ్డను దూరం చేసుకుంది. కొన్ని రోజులకే భర్తను కోల్పోయింది. ఇప్పుడు తనకు ఒకే దిక్కుగా ఉన్న శ్వేత కూడా దూరం అయిపోయింది. దీంతో ఇప్పుడు తనది ఒంటరి బతుకు అయిపోయింది రమది.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది