Vizag YMCA Swetha : వివాహిత శ్వేతా మృతి కేసులో బిగ్ ట్విస్ట్…! కీలకంగా మారనున్న ఆ ఆధారం..!!

Authored By Breaking News | The Telugu News | Published on: April 28, 2023, 9:00 pm

Vizag YMCA Swetha : వివాహిత శ్వేత అనుమానాస్పద మృతి కేసు విచారణ ఇంకా కొనసాగుతూ ఉంది. ఈ కేసులో రకరకాల ట్విస్ట్ లు బయటకు వస్తున్నాయి. ఇప్పటికే ఈ ఘటనలో పోలీసులు కొందరిపై కేసులు నమోదు చేయటం తెలిసింది. భర్త మణికంఠ చెల్లెలు భర్త పైన లైంగిక వేధింపుల కేసు నమోదు అయింది. శ్వేత తల్లి రమాదేవి ఫిర్యాదుతో త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. భర్తతో గొడవ పడిన శ్వేత ఇంటి నుండి వెళ్లిపోవడం జరిగింది.

Woman Dead Body Found In Visaka Beach In Suspicious Condition - Sakshi

ఆ తర్వాత కొద్ది గంటలకు విశాఖ YMCA బీచ్ లో సముద్రపు అలలలో కొట్టుకు రావటం జరిగింది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని అనుమానస్పదకు కేసును నమోదు చేయడం జరిగింది. అయితే అప్పటినుండి ఈ కేసు మిస్టరీగానే ఉంది. కొంతకాలంగా భర్త, అత్త మామల వేధింపులు ఎక్కువయ్యాయని శ్వేత ఇంటి నుండి బయలుదేరే గంట ముందు కూడా తన భర్త మణికంఠతో గొడవ పడిందని… శ్వేత తల్లి సంచలన ఆరోపణలు చేయడం జరిగింది.

Vizag YMCA Swetha CC TV Footage Latest News Updates RK Beach Vizag

Vizag YMCA Swetha CC TV Footage Latest News Updates RK Beach Vizag

తన కూతురు మణికంఠ కుటుంబ సభ్యుల వేధింపుల వల్లే మరణించినట్లు శ్వేత తల్లి రమాదేవి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ కేసులో శ్వేత కాల్ రికార్డ్స్, పోస్టుమార్టం కీలకంగా మారనున్నాయి. ఈ క్రమంలో పోలీసులు శ్వేత ఇంటిలో సీసీటీవీ ఫుటేజ్ తో పాటు చుట్టుప్రక్కల సీసీటీవీ ఫుటేజ్ లు పోలీసులు పరిశీలిస్తున్నారు. ఆ సీసీ టీవీ ఫుటేజ్ తో పాటు కాల్ రికార్డింగ్స్ శ్వేతా కేసులో ఇప్పుడు కీలకంగా మారిన ఉన్నాయని పోలీసులు చెప్పుకొచ్చారు.

Breaking News

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp