Ysrcp : బిగ్ బ్రేకింగ్ : విశాఖ మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ కి బ్లాక్ బస్టర్ గుడ్ న్యూస్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ysrcp : బిగ్ బ్రేకింగ్ : విశాఖ మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ కి బ్లాక్ బస్టర్ గుడ్ న్యూస్..!

 Authored By siddhu | The Telugu News | Updated on :21 March 2026,4:17 pm

ప్రధానాంశాలు:

  •  Ysrcp : బిగ్ బ్రేకింగ్ : విశాఖ మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ కి బ్లాక్ బస్టర్ గుడ్ న్యూస్..!

Ysrcp : ఆంధ్రరాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల వేడి అప్పుడే మొదలైపోయింది. ముఖ్యంగా విశాఖపట్నం కార్పొరేషన్ చుట్టూ ఇప్పుడు రాజకీయాలు తిరుగుతున్నాయి. గత ఎన్నికల్లో ఇక్కడ గెలిచిన సమీకరణాలు ఒకలా ఉంటే ఇప్పుడున్న పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితా కోసం మరికొంత సమయం అడిగినా కేంద్ర ఎన్నికల కమిషన్ మాత్రం ససేమిరా అంది. ఈ వారంలోనే తుది జాబితా ఇచ్చేయాలని గట్టిగా చెప్పడంతో ఎన్నికలు త్వరలోనే వస్తాయని అందరూ భావిస్తున్నారు. అందుకే అన్ని పార్టీలు ఇప్పుడే రంగంలోకి దిగి తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి.

Ysrcp బిగ్ బ్రేకింగ్ విశాఖ మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ కి బ్లాక్ బస్టర్ గుడ్ న్యూస్

Ysrcp : బిగ్ బ్రేకింగ్ : విశాఖ మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ కి బ్లాక్ బస్టర్ గుడ్ న్యూస్..!

విశాఖ లాంటి పెద్ద నగరంలో గెలవడం అంటే అది రాష్ట్ర రాజకీయాల్లో ఒక పెద్ద గెలుపుగా అందరూ చూస్తారు. అందుకే ఇక్కడ పాగా వేయడానికి అధికార ప్రతిపక్ష పార్టీలు ఇప్పటి నుంచే గ్రౌండ్ లెవెల్ లో పనులు మొదలుపెట్టాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇక్కడ సీన్ మొత్తం మారిపోయింది. వైసీపీ నుంచి గెలిచిన కౌన్సిలర్లలో చాలామంది మేయర్ పీఠం మార్పు కోసం కూటమి వైపు వెళ్ళిపోయారు. ప్రస్తుతం ఆ పార్టీలో కేవలం 32 మంది మాత్రమే మిగిలారని తెలుస్తోంది.

Ysrcp : రాజకీయ వ్యూహాలు ప్రతివ్యూహాలు

గతంలో విశాఖ మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీకి మంచి ఫలితాలు వచ్చాయి. 98 డివిజన్లకు గాను దాదాపు 59 చోట్ల గెలిచి మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. అప్పట్లో బీసీ మహిళకు మేయర్ పదవి ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే 2024 అసెంబ్లీ ఎన్నికల తర్వాతదీంతో ఆ పార్టీ ఇప్పుడు కొత్త ప్లాన్ తో ముందుకెళ్తోంది. పార్టీని వీడిన వారిని పక్కన పెట్టి ప్రస్తుతం ఉన్న 32 మందికి మళ్ళీ అవకాశం ఇవ్వాలని చూస్తోంది. మిగిలిన డివిజన్లలో కూడా ప్రతి చోటా ముగ్గురు చొప్పున ఇంచార్జీలను పెట్టి ఇప్పటి నుంచే ప్రజల్లోకి వెళ్లేలా ప్లాన్ చేస్తోంది. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను అలాగే భూముల వ్యవహారాలు వంటి అంశాలను జనానికి వివరిస్తూ మళ్ళీ పుంజుకోవాలని చూస్తోంది. కూటమి ప్రభుత్వం కూడా విశాఖపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది కాబట్టి ఈసారి ఎన్నికలు చాలా రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. ఎలక్షన్ల సమయానికి ప్రజల తీర్పు ఎలా ఉంటుందో చూడాలి.

siddhu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది