Vladimir Putin : ఉక్రెయిన్ దేశాలకు మద్దతుగా నిలుస్తున్న వారికి వ్లాదిమిర్ పుతిన్ వార్నింగ్… జోక్యం చేసుకోవద్దు అంటూ సున్నిహితంగా హెచ్చరిక
Vladimir Putin : శాంతియుగా చర్చలు సాగుతున్నాయనుకుంటున్న సమయంలో రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. అయితే ఉక్రెయిన్ విషయంలో ఎవరూ జోక్యం చేసుకోవద్దని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హెచ్చరించాడు. యుద్దంలో ఇతర దేశాలు జోక్యం చేసుకుంటే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. ఉక్రెయిన్ స్వాధీనం చేసుకునే ఉద్ధేశ్యం రష్యాకు లేదన్నారు. వేర్పాటువాద ప్రాంతాల్లో పౌరులకు రక్షణకు మిలటరీ ఆపరేషన్ మొదలైనట్లు తెలిపారు. ఉక్రెయిన్‌ను నాటోలో చేర్చవద్దనేది తమ డిమాండ్ అని పేర్కొన్నారు. అయితే తమ డిమాండ్‌ను అమెరికా, మిత్ర దేశాలు విస్మరించాయని అన్నారు.ఎవరైనా మా ఘర్షణల విషయంలో జోక్యం చేసుకోవాలని చూసినా,
మా దేశాన్ని బెదిరించినా, మా ప్రజల భద్రతకు విఘాతం కలిగించినా.. మేం వెనువెంటనే బదులిస్తాం.మేము ఇచ్చే బదులు ఎలా ఉంటుందంటే.. మీ జీవితంలో అలాంటి తీవ్రమైన పరిణామాలను కనీవినీ ఎరిగి ఉండరు. దీనికి సంబంధించి మేం దేనికైనా తెగించేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే అందుకు అనుగుణంగా అన్ని చర్యలూ తీసుకున్నాం. కాబట్టి అందరూ నా మాట వింటారని అనుకుంటున్నా’’ అంటూ వ్లాదిమిర్ పుతిన్ వార్నింగ్ ఇచ్చారు.ఇప్పటికే ఉక్రెయిన్ ప్రభుత్వం ఎమర్జెన్సీ ప్రకటించింది. ఉక్రెయిన్‌కు 3 వైపులా బలగాలను రష్యా మోహరించింది. ఉక్రెయిన్ సరిహద్దులకు యుద్ధ ట్యాంక్‌లను తరలించింది. ఎయిర్‌స్పేస్‌ను మూసేసింది. అయితే రష్యా దాడులను తిప్పికొడతామని హెచ్చరించింది. యుద్ధంలో రష్యాపై విజయం సాధిస్తామని పేర్కొంది.
Vladimir Putin : అక్కడ ఏం జరుగుతుంది..
క్రెయిన్‌లో జరుగుతున్న రక్తపాతానికి కారణం ఆ దేశ పాలకులేనని స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌లో డీ మిలటరైజేషన్ (నిస్సైనీకరణ) కోసమే తాము ప్రయత్నాలు మొదలుపెట్టామని, అందువల్ల ఆ దేశ సైనికులు ఆయుధాలు పడేసి ఇంటికెళ్లిపోవాలని ఆయన కోరారు. లేనిపక్షంలో చరిత్ర మరచిపోలేని భీకయ భయానక పరిస్థితులను చూస్తారని పుతిన్ హెచ్చరించారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత లేదా రష్యా ఏర్పడినప్పుడు తమ జీవితాలు ఎలా ఉండాలని కోరుకుంటున్నారో అన్నది ప్రస్తుతం ఉక్రెయిన్‌లో భాగమైన ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను అడుగలేదని పుతిన్ గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉక్రెయిన్‌లో నివసిస్తున్న ప్రజల్లో ఎవరైనా ఇప్పుడు దీనిని కోరుకుంటే స్వేచ్ఛగా ఆ విధంగా ఎంపిక చేసుకునే హక్కు వారికి తప్పక ఉంటుందన్నారు.