War 2 | వార్ 2 ఓటీటీ టైం ఫిక్స్ అయిన‌ట్టేనా.. స్ట్రీమింగ్ ఎప్ప‌టి నుండి అంటే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

War 2 | వార్ 2 ఓటీటీ టైం ఫిక్స్ అయిన‌ట్టేనా.. స్ట్రీమింగ్ ఎప్ప‌టి నుండి అంటే..!

 Authored By sandeep | The Telugu News | Updated on :29 August 2025,3:00 pm

War 2 | మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ వార్ 2 .కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన దేవర సినిమా తర్వాత బాలీవుడ్ సినిమాతో అభిమానులను అల‌రించేందుకు తార‌క్ వార్ 2 సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. తారక్ తో కలిసి హృతిక్ రోషన్ కూడా ఈ సినిమాలో నటించడంతో మూవీ పై భారీ బజ్ క్రియేట్ అయ్యింది. తీరా సినిమా విడుదలైన తర్వాత అభిమానుల అంచనాలను తలక్రిందులు చేసింది వార్ 2.

#image_title

ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..

ఆగస్టు 14, 2025న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా రూ. 350కోట్లకు పైగా వసూల్ చేసింది. ఇక ఇప్పుడు వార్ 2 ఓటీటీ రిలీజ్ గురించి రోజుకొక వార్త సోషల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. వార్ ను సినిమాను థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేసిన ఆడియన్స్ ఇప్పుడు ఓటీటీలో మరోసారి చూసేందుకు ఆసక్తిగా ఉన్నారు. ఇటీవలే వార్ 2 ఓటీటీ హాక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుందని తెలుస్తుంది. త్వరలోనే నెట్ ఫ్లిక్స్ వార్ 2 సినిమాను స్ట్రీమింగ్ చేయనుందని తెలుస్తుంది.

సెప్టెంబర్ 12న నెట్ ఫ్లిక్స్ లో వార్ 2 సినిమా అందుబాటులోకి రానుందని తెలుస్తుంది. దాంతో అభిమానులు వార్ 2 సినిమాను ఓటీటీలో వీక్షించేందుకు రెడీ అవుతున్నారు. యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో ఆరో భాగంగా ఈ సినిమా ను తెరకెక్కించారు. వార్ 2 సినిమాలో యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా తారక్ , హృతిక్ మధ్య వచ్చే సీన్స్ సినిమాకే హైలైట్ అనే చెప్పాలి.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది