Kalamkaval Movie Review : కలాం కావల్‌ మూవీ ఫ‌స్ట్ రివ్యూ అండ్ రేటింగ్‌..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Kalamkaval Movie Review : కలాం కావల్‌ మూవీ ఫ‌స్ట్ రివ్యూ అండ్ రేటింగ్‌..!

 Authored By suma | The Telugu News | Updated on :18 January 2026,2:40 pm

ప్రధానాంశాలు:

  •  Kalamkaval Movie Review : కలాం కావల్‌ మూవీ ఫ‌స్ట్ రివ్యూ అండ్ రేటింగ్‌..!

Kalamkaval Movie Review : కొన్ని పాత్రలు చూసిన వెంటనే ఇది ఈ నటుడే చేయగలడు అనిపిస్తాయి. అలాంటి అరుదైన నటుల్లో మలయాళ దిగ్గజం మమ్ముట్టి ( Mammootty )ముందుంటారు. కథ ఎంపిక నుంచి పాత్రలో లీనమయ్యే వరకు ఆయనకు ఆయనే సాటి. హీరోగా, విలన్‌గా, గ్రే షేడ్స్‌తో, బయోపిక్‌ల్లోనూ 400కు పైగా సినిమాల్లో విభిన్న పాత్రలు పోషించిన మమ్ముట్టి తాజాగా ‘కలాం కావల్‌’తో మరోసారి తన నటనా శక్తిని నిరూపించారు. నిజ జీవిత సీరియల్ కిల్లర్‌ సయనైడ్ మోహన్‌ కేసు ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఇప్పుడు సోనీ లివ్‌లో తెలుగులో స్ట్రీమింగ్‌ అవుతూ ప్రేక్షకులను కట్టిపడేస్తోంది.

Kalamkaval Movie Review కలాం కావల్‌ మూవీ ఫ‌స్ట్ రివ్యూ అండ్ రేటింగ్‌

Kalamkaval Movie Review : కలాం కావల్‌ మూవీ ఫ‌స్ట్ రివ్యూ అండ్ రేటింగ్‌..!

Kalamkaval Movie Review : సైకో కిల్లర్‌ మైండ్‌గేమ్‌.. కథా విశ్లేషణ

‘కలాం కావల్‌’ ప్రత్యేకత ఏంటంటే..కథ మొదలైన కొద్ది నిమిషాల్లోనే హత్యలు చేసేది ఎవరో ప్రేక్షకుడికి తెలిసిపోతుంది. కానీ పోలీసులకు మాత్రం కాదు. ఈ కాన్సెప్ట్‌తో దర్శకుడు జితిన్‌ కె.జోస్‌ ప్రేక్షకుడిని పూర్తిగా కథలోకి లాగేస్తాడు. సైకో కిల్లర్‌ ఎలా ఆలోచిస్తాడు ఎందుకు వరుస హత్యలు చేస్తాడు అనే అంశాన్ని చాలా లోతుగా సహజంగా చూపించాడు. మన చుట్టూ ఉండే జీవులను చంపడంలో కొందరికి విచిత్రమైన సంతృప్తి ఉంటుంది. అదే భావనను మరో స్థాయికి తీసుకెళ్లిన పాత్రే స్టాన్లీ దాస్‌. అతడికి ఒంటరి మహిళలను ట్రాప్‌ చేసి చంపడమే ఆనందం. ప్రేమ, పెళ్లి, కొత్త జీవితం అనే ఆశ చూపించి వారిని నమ్మిస్తాడు. ఒకరోజు వారితో గడిపి అదే రోజున చంపేస్తాడు. ఈ హత్యల పరంపర సినిమా చివరి వరకు ఆగకుండా కొనసాగుతుంది. అయినా ఎక్కడా బోర్‌ అనిపించదు.

Kalamkaval Movie Review : ఇన్వెస్టిగేషన్‌ vs ఇంటెలిజెన్స్‌..కథలో మలుపులు

ఒక మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో కథ కీలక మలుపు తిరుగుతుంది. ఈ కేసులోకి ఎస్సై జయకృష్ణన్‌ (వినాయకన్‌) ఎంట్రీ ఇస్తాడు. పోలీసుల దర్యాప్తు ఎంత వేగంగా సాగుతుందో అంతకంటే వేగంగా స్టాన్లీ దాస్‌ ఆలోచనలు ఉంటాయి. కూల్‌గా ఎలాంటి తొందరపడకుండా హత్యలు చేస్తూ పోలీసులను మోసం చేస్తుంటాడు. కేరళ, తమిళనాడు సరిహద్దు ప్రాంతంలోని మహిళలనే ఎందుకు టార్గెట్‌ చేస్తున్నాడు? ఒంటరిగా ఉన్న వారినే ఎందుకు ఎంచుకుంటున్నాడు? పోలీసుల నుంచి ఎలా తప్పించుకుంటున్నాడు? ఈ ప్రశ్నలన్నీ కథను ముందుకు నడిపిస్తాయి. జయకృష్ణన్‌ దర్యాప్తు స్టాన్లీ మైండ్‌గేమ్‌ సమాంతరంగా సాగడం సినిమాకు ప్రధాన బలం. టెక్నాలజీ లేని కాలంలో పోలీసులు కేసులను ఎలా చేధించేవారో చాలా సహజంగా చూపించారు.

Kalamkaval Movie Review : నటన, టెక్నికల్‌ బలాలు..ఫైనల్‌ వెర్డిక్ట్

కథ 2000 సంవత్సరంలో జరిగేదిగా చూపించడంతో లాజిక్‌ లోపాలు కనిపించవు. అప్పట్లో సీసీ కెమెరాలు, ఆధునిక మొబైల్స్‌ లేవు. ఈ నేపథ్యం సినిమాకు మరింత నమ్మకాన్ని తీసుకొచ్చింది. ఇంటర్వెల్‌ సమయంలో స్టాన్లీ దాస్‌ అసలు రూపాన్ని బయటపెట్టే ట్విస్ట్‌ ప్రేక్షకుడిని షాక్‌కు గురిచేస్తుంది. పోలీసుల మధ్యే ఉంటూ వారి ప్లాన్లను తెలుసుకుని తప్పించుకునే తీరు ఆసక్తికరంగా ఉంటుంది. మమ్ముట్టి స్టాన్లీ దాస్‌గా పూర్తిగా లీనమయ్యారు. చూపు, నడక, మాట అన్నీ ఒక సైకో కిల్లర్‌ మానసిక స్థితిని ప్రతిబింబిస్తాయి. వినాయకన్‌ కూడా ఎస్సై జయకృష్ణన్‌గా గుర్తుండిపోయే నటన చేశారు. క్లైమాక్స్‌లో స్టాన్లీనే హంతకుడని నిర్ధారించే సీన్‌ సినిమాకే హైలైట్‌. వరుస హత్యలు ఉన్నప్పటికీ ఎక్కడా అసభ్యత అధిక రక్తపాతం లేకుండా దర్శకుడు జాగ్రత్త పడ్డాడు. అందుకే కుటుంబంతో కలిసి చూసేలా సినిమా సాగుతుంది. మలయాళంలో భారీ విజయాన్ని సాధించిన ‘కలాం కావల్‌’ తెలుగులోనూ థ్రిల్లర్‌ అభిమానులను ఖచ్చితంగా మెప్పిస్తుంది. సైకో థ్రిల్లర్‌ ఇష్టపడేవారు మిస్‌ కాకూడని సినిమా ఇది. Kalamkaval Movie Review , Mammootty , Kalamkaval Movie Rating, Kalamkaval Telugu Review, Mammootty Kalamkaval Review , Kalamkaval Movie Story Analysis, Kalamkaval Sony Liv Movie, కలాం కావల్ మూవీ రివ్యూ , కలాం కావల్ మూవీ రేటింగ్ , మమ్ముట్టి కలాం కావల్ సినిమా రివ్యూ, కలాం కావల్ తెలుగు రివ్యూ, కలాం కావల్ మూవీ కథ విశ్లేషణ, కలాం కావల్ సోనీ లివ్ సినిమా, సైకో థ్రిల్లర్ సినిమా రివ్యూ , సైకో థ్రిల్లర్ సినిమా రివ్యూ , ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ, సీరియల్ కిల్లర్ ఆధారంగా సినిమా, పోలీస్ దర్యాప్తు కథతో సినిమా,పోలీస్ దర్యాప్తు కథతో సినిమా

No liveblog updates yet.

LIVE UPDATES

suma

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది