YS Sharmila : జగన్ తో వార్ కు సిద్ధమైన షర్మిల.. ఏపీలో కూడా రాజన్న రాజ్యం కోసం?
YS Sharmila : వైఎస్ షర్మిల ప్రస్తుతం తెలంగాణలో యాక్టివ్ అయ్యారు. తెలంగాణ రాజకీయాల్లో షర్మిల తనదైన ముద్ర వేస్తున్నారు. నిన్నటి వరకు తను తెలంగాణలో ఉద్యోగ దీక్ష చేపట్టారు. దానికి బాగానే రెస్పాన్స్ వచ్చింది. తెలంగాణ రాజకీయాల్లో దూకుడు మీదున్న షర్మిల జులై 8న తెలంగాణలో పార్టీ పెట్టబోతున్నారు. ఇప్పటికే ఖమ్మంలో సంకల్ప సభ నిర్వహించగా… అది సూపర్ సక్సెస్ అయింది. చాలామంది ఇతర పార్టీలకు చెందిన నేతలు షర్మిల పార్టీలో చేరేందుకు సన్నద్ధం అవుతున్నారు. జులై 8న షర్మిల పార్టీ పెట్టే రోజునే పలువురు నేతలు షర్మిల పార్టీలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. అన్నీ ఓకే అయితే తెలంగాణ రాజకీయాల్లో షర్మిల చక్రం తిప్పనున్నారు.
అంతవరకు బాగానే ఉంది కానీ.. ఏపీ పరిస్థితి ఏంటి? 2019 ఎన్నికల్లో ఏపీలో రాజన్న రాజ్యం తీసుకొస్తాం అని చెప్పి… వైఎస్సార్సీపీ తరుపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న షర్మిల.. ఇప్పుడు ఏపీని వదిలేసి.. తెలంగాణలో పార్టీ పెట్టి… తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తా అని మాటివ్వడం ఏంటి? ఏపీ ప్రజలను పట్టించుకోరా? ఇచ్చిన మాటను గట్టున పెట్టారా? ఏపీలో రాజన్న రాజ్యం ఎక్కడుంది ఇప్పుడు… అంటూ ఏపీ ప్రజలు షర్మిలను ప్రశ్నిస్తున్నారు.
ముఖ్యంగా అమరావతే రాజధానిగా ఉండాలంటూ ఆందోళన చేస్తున్న అమరావతి ప్రాంత రైతులు.. షర్మిలను కలవాలని ప్రయత్నిస్తున్నారు. తమ ఆవేదనను తనకు వినిపించేందుకు అమరావతి ప్రాంత మహిళా రైతులు సిద్ధం అయ్యారు. అమరావతి రాజధాని కోసం తమకు మద్ధతుగా ఏపీలో పోరాడాలని వాళ్లు షర్మిలకు విన్నవించనున్నారట. 2019 లో తను ఇచ్చిన మాట మీద నిలబడాలని… ఏపీలోనూ రాజన్న రాజ్యం కావాలని వాళ్లు షర్మిలను కోరనున్నట్టు తెలుస్తోంది.
YS Sharmila : బ్రదర్ అనీల్ ను కలిసిన క్రిస్టియన్ సంఘాల నేతలు
అలాగే… క్రిస్టియన్ సంఘాల నేతలు కూడా బ్రదర్ అనీల్ కుమార్ ను కలిసి.. షర్మిల పార్టీని ఏపీలో కూడా విస్తరించాలని కోరారట. ఏపీ రాజకీయాల్లో కూడా షర్మిల ఉండాలని…. తెలంగాణలోనే కాదు… తమకు ఏపీలో కూడా రాజన్న రాజ్యం కావాలని వాళ్లు కోరారట. అంటే అన్ని విధాలుగా చూస్తే… ఏపీలో ఒకవేళ షర్మిల రంగంలోకి దిగితే… ఖచ్చితంగా అన్న జగన్ తో వార్ కు సంకేతం ఇచ్చినట్టే కదా. రాజన్న రాజ్యం ఏపీలో కూడా రావాలంటే… షర్మిల ఖచ్చితంగా జగన్ తో యుద్ధం చేయాల్సిందే. మరి.. షర్మిల ఈ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే.