Rain : తెలంగాణ, ఏపీలో భారీ వర్షాలు.. ఈ ప్రాంతాల వారికి చాలా డేంజర్ అంటున్నఐఎండీ
ప్రధానాంశాలు:
Rains : తెలంగాణ, ఏపీలో భారీ వర్షాలు.. ఈ ప్రాంతాల వారికి చాలా డేంజర్ అంటున్నఐఎండీ
Rain : వర్షాల కోసం ఎదురుచూస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు ఏ మాత్రం ఉపశమనం ఇవ్వడం లేదు. ఏదో అలా వచ్చి ఇలా పోతున్నాయి. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు ఆశించిన మేర లేకపోవటంతో ముఖ్యంగా రైతులు ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాలలో రైతులు వర్షాభావ పరిస్థితుల నేపధ్యంలో వరుణ దేవుడి కరుణ కోసం ప్రత్యేక పూజలు చేస్తున్నారు. కప్పతల్లి పూజలు చేస్తున్నారు. కప్పలకు పెళ్ళిళ్ళు జరిపించి వరుణ దేవా కరుణించు అంటూ పూజలు చేస్తున్నారు. సంవృద్దిగా వర్షాలు కురవాలని కోరుతున్నారు.
Rain వర్షాలే వర్షాలు..
కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, గోవాల్లో పగటి పూట భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచిస్తూ ఈ ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. “నైరుతి ద్వీపకల్ప భారతంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది, ఈశాన్య, దానిని ఆనుకుని ఉన్న తూర్పు భారతంలో రానున్న ఐదు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయి,” అని ఐఎండీ తన సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొంది. వాయువ్య బంగాళాఖాతం వరకు విస్తరించిన ద్రోణి ప్రభావంతో ఏపీ తెలంగాణలో మూడు నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఏపీలో ఇవాళ(జులై 13) మన్యం, అల్లూరిసీతారామరాజు, కాకినాడ, కోనసీమ,తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి,ఏలూరు,గుంటూరు, బాపట్ల,పల్నాడు,ప్రకాశం,నంద్యాల, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్, నెల్లూరు, కర్నూలు, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.జూలై 16 వరకు గోవా, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ జూలై 12న విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌లో ఆది, సోమవారాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.