YS Jagan : దేశంలోనే ఎక్కువ డబ్బు ఉన్న సీఎంగా జగన్, క్రిమినల్ కేసుల లిస్ట్ లో కేసీఆర్ టాప్
YS Jagan : ఫేమస్ ఇంగ్లీష్ వెబ్ సైట్ ది ప్రింట్.. తాజాగా దేశంలోని అందరు ముఖ్యమంత్రులకు సంబంధించి సర్వే నిర్వహించింది. సీఎంల ఆస్తులు, క్రిమినల్ కేసులు, ఇతర వివరాలపై ప్రింట్ వెబ్ సైట్ ఒక నివేదికను తాజాగా విడుదల చేసింది. ఆ నివేదికను ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రులు సమర్పించే అఫిడవిట్ల ఆధారంగా తయారు చేసింది. అయితే.. ప్రింట్ నివేదిక ప్రకారం.. దేశంలోనే అత్యంత ధనిక సీఎం జగన్ అట. అత్యంత పేద సీఎం వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అట. ఏపీ సీఎం వైఎస్ జగన్.. అత్యంత ధనిక సీఎంగా టాప్ ప్లేస్ లో నిలిచారు.
ఆయనకు ప్రస్తుతం ఉన్న ఆస్తుల విలువ రూ.370 కోట్లు అని నివేదికలో వెల్లడించారు. అయితే.. అవి వారసత్వంగా, బిజినెస్ చేసి సంపాదించిన ఆస్తులు అని చెప్పుకొచ్చారు. ఇక.. స్థిరాస్తుల్లో టాప్ లో ఉన్న జగన్.. ఆ తర్వాత సెకండ్ ప్లేస్ లో అరుణాచల్ ప్రదేశ్ సీఎం ఉన్నారు. ఆయన ఆస్తుల విలువ రూ.132 కోట్లు. అత్యంత పేద సీఎంగా ఉన్న మమతా బెనర్జీ ఆస్తుల విలువ కేవలం రూ.15 లక్షలు మాత్రమే. ఆస్తుల జాబితాలో చివర్లో రెండో స్థానంలో బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఉన్నారు.
YS Jagan : పేద ముఖ్యమంత్రుల జాబితాలో బీహార్, కేరళ సీఎం కూడా
ఆయన ఆస్తుల విలువ కేవలం రూ.56 లక్షలు మాత్రమే. ఆ తర్వాత స్థానంలో కేరళ సీఎం పినరయి విజయన్ ఉన్నారు. ఆయన ఆస్తుల విలువ రూ.72 లక్షలు. ఇక.. క్రిమినల్ కేసుల జాబితాలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫస్ట్ ప్లేస్ లో నిలిచారు. కేసీఆర్ మీదనే ఎక్కువ క్రిమినల్ కేసులు ఉన్నట్టుగా ప్రింట్ వెబ్ సైట్ వెల్లడించింది. ఆ తర్వాత తమిళనాడు సీఎం స్టాలిన్ నిలిచారు. ఆయనపై 47 కేసులు ఉన్నాయి. సీఎం జగన్ పై 38 కేసులు ఉన్నాయి. అయితే.. బీజేపీకి చెందిన ముఖ్యమంత్రులు ఎవ్వరి మీదా ఎలాంటి కేసు లేదని నివేదికలో స్పష్టం చేసింది.