Fishing Boat : చేపల వేటకి వెళ్లిన బోటుపై దాడి చేసిన తిమింగలం.. భయంతో మరో బోటు వ్యక్తి పరుగు.. వీడియో వైరల్…
ప్రధానాంశాలు:
Fishing Boat : చేపల వేటకి వెళ్లిన బోటుపై దాడి చేసిన తిమింగలం.. భయంతో మరో బోటు వ్యక్తి పరుగు.. వీడియో వైరల్...
Fishing Boat : ప్రపంచంలో అనేక రకాల తిమింగలాలు ఉంటాయనే విషయం మనందరికి తెలిసిందే. 21వ శతాబ్దంలో అనేక జాతుల తిమింగలాలు ఉండగా, వీటిలో చాలా వరకు అంతరించిపోయే దశలో ఉన్నట్లు గుర్తించారు. అయితే తిమింగలాలు సముద్రంలో ప్రయాణించే బోట్లపై దాడులు చేస్తుండడం పలుమార్లు మనం గమనించడం మనం చూశాం.తాజాగా మెరికాలోని న్యూహాంప్‌షైర్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అక్కడ ప్రోట్స్‌మౌత్ హార్బర్ సముద్రంలో ఓ భారీ తిమింగలం చేపల వేట పడవపై ఒక్కసారిగా దాడి చేయగా, ఇందుకు సంబంధంచిన వీడియో వైరల్ అయింది.
Fishing Boat సినిమాల్లో మాదిరిగానే..
అయితే ప్రోట్స్‌మౌత్ హార్బర్ సముద్రంలో బోటుపై తిమింగలం ఒక్కసారిగా దాడి చేయడంతో అది ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి పడవ బోల్తా పడింది. అయితే, అదృష్టవశాత్తూ అందులో ఉన్న ఇద్దరు వ్యక్తులు సురక్షితంగా బయటపడినట్లు యూఎస్ కోస్ట్ గార్డ్ తెలిపింది. అయితే ఒడియోర్న్ పాయింట్ స్టేట్ పార్క్ సమీపంలో మంగళవారం ఈ ఘటన జరగగా, ఇందుకు సంబంధించిన వివరాలు చూస్తే.. 23 అడుగుల సెంటర్ కన్సోల్ బోట్‌లో ఇద్దరు వ్యక్తులు మంగళవారం ఉదయం చేపల వేటకై సముద్రంలోకి వెళ్లారు. ఆ సమయంలో ఓ భారీ తిమింగలం వారి బోటు సమీపానికి వచ్చింది.
అయితే ఒక్కసారిగా నీటి లోంచి గాల్లోకి లేచిన తిమింగలం బోటుపై పడింది. దీంతో బోటు ఒక్కసారిగా బోల్తాపడింది. ఈ ఘటనతో భయాందోళనకు గురైన బోటులోని ఇద్దరి వ్యక్తులు నీటిలో దూకేయగా, మరో వ్యక్తి నీటిలో మునిగిపోయారు. ఇదంతా గమనించిన స్థానికులు వెంటనే అక్కడికి చేరుకొని వారిని సురక్షితంగా కాపాడారు. అయితే అక్కడే చేపలు పట్టేందుకు వచ్చిన మరో వ్యక్తి ఇదంతా గమనించి తన బోటుని అక్కడ నుండి స్పీడ్ గా లాగించారు. ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతున్నారు. సముద్రంలో ప్రయాణించే ముందు పలు జాగ్రత్తలు తీసుకోవాలి అంటూ సూచనలు చేస్తున్నారు.