YS Jagan : ఆ చెడ్డ పేరు రాకుండా వైఎస్ జగన్ ప్రభుత్వం జాగ్రత్త పడింది
YS Jagan : వైకాపా ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ వ్యవహారం పార్టీలో కాస్త ఇబ్బందికరంగా మారింది. ఆయన హత్య కేసులో చిక్కుకోవడంతో పార్టీని టార్గెట్ చేసే విధంగా విపక్ష పార్టీలు విమర్శలు చేయడం మొదలు పెట్టాయి. అయితే ఇక్కడ వైకాపా ప్రభుత్వం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఉదయ భాస్కర్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించడంతో పెద్ద విమర్శలు… జనాల్లో వ్యతిరేకత తప్పించుకున్నట్లు అయ్యిందంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
సాదారణంగా అయితే ఇలాంటి వ్యవహారాలు బయటకు పొక్కకుండా పోలీసులను మ్యానేజ్ చేసి.. మీడియా కళ్లు కప్పే విధంగా ప్రభుత్వాలు వ్యవహరిస్తాయి. తమ పార్టీకి చెందిన నాయకుడు అది కాకుండా తమ పార్టీ ఎమ్మెల్సీ హత్యా కేసులో ఇరుక్కుంటే ఖచ్చితంగా రాజకీయంగా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందనే ఉద్దేశ్యంతో చాలా వరకు ఇలాంటి కేసులు బయటకు రాకుండానే జాగ్రత్త పడతారు. కాని వైకాపా అలా చేయనందుకు అభినందనీయం.
విపక్షాలు మొదట్లో విమర్శలు చేసినా కూడా తమ పార్టీ ఎమ్మెల్సీ ని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపడం వల్ల ఖచ్చితంగా ప్రజల్లో పాజిటివ్ భావం కలుగుతుంది. చంద్రబాబు నాయుడు మాత్రమే కాకుండా ఇతర విపక్ష పార్టీ ల నాయకులు ఈ విషయమై మాట్లాడే అవకాశం లేకుండా ప్రభుత్వం కొన్ని గంటల వ్యవధిలోనే అనంత ఉదయ భాస్కర్ ను అరెస్ట్ చేయడం జరిగింది. ఈ విషయంలో వైకాపా ప్రభుత్వంకు అభినందనలు అంటూ స్వయంగా మృతిడి కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో కూడా ఇంకా కొందరు విమర్శలు చేస్తే అది రాజకీయం అవుతుంది.