Hitler History : హిట్లర్ చిన్నతనంలో ఏం జరిగింది? తను నియంతలా ఎలా మారాడు? హిట్లర్ గురించి ఎవ్వరికీ తెలియని రహస్యాలు ఏంటి? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Hitler History : హిట్లర్ చిన్నతనంలో ఏం జరిగింది? తను నియంతలా ఎలా మారాడు? హిట్లర్ గురించి ఎవ్వరికీ తెలియని రహస్యాలు ఏంటి?

 Authored By prabhas | The Telugu News | Updated on :18 July 2022,1:00 pm

Hitler History : తన పేరు వింటేనే ప్రపంచమంతా వణికింది. తన మాటే శాసనం. ఎదురు తిరిగిన ప్రతి వాడిని కాల్చి చంపిన వాడు. కేవలం తన కోపం, ధ్వేషం తీర్చుకునేందుకే కొన్ని లక్షల మంద ప్రాణాలను తీసేశాడు. మనుషుల ప్రాణాలు తీయడాన్ని ఒక ఆటలా ఆనందించే మానవత్వం లేని మృగంగా చరిత్రలో నిలిచిన ఆ వ్యక్తే హిట్లర్. ఈ వీడియో ఒక సైనికుడి స్థాయి నుంచి దేశ అధినేతగా ఎదిగాడు. హిట్లర్ అంత క్రూరంగా మారడానికి తన చిన్నతనంలో జరిగిన సంఘటనలు ఏంటి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. మీకు ఇంకా ఇలాంటి ఇంటరెస్టింగ్ వీడియోలు కావాలంటే ఈ చానెల్ కు సబ్ స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. హిట్లర్ పూర్తి పేరు అడాల్ఫ్ హిట్లర్. తన తల్లిదండ్రులకు నాలుగో సంతానంగా పుట్టాడు. హిట్లర్ ది జర్మనీకి పక్కనే ఉన్న ఆస్ట్రియా హంగేరి సరిహద్దుల్లో ఉన్న ఓ గ్రామంలో జన్మించాడు. 1889, ఏప్రిల్ 20న హిట్లర్ జన్మించాడు.

చిన్నప్పటి నుంచి హిట్లర్ కు జర్మనీ అంటే చాలా ఇష్టం. హిట్లర్ చిన్నప్పుడు చాలా పొట్టిగా ఉండేవాడు. దీంతో తన తల్లిదండ్రులు స్కూల్ కు పంపినా.. తాను పొట్టిగా ఉన్నానని స్కూల్ కు వెళ్లనని చెప్పాడు. అయినప్పటికీ హిట్లర్ ను స్కూల్ కు వెళ్లాలంటూ కొట్టేవాడు. కానీ.. హిట్లర్ కు తన తల్లి మద్దతు ఇచ్చేది. చివరకు తనకు ఇష్టం లేదని తల్లి స్కూల్ మాన్పించేసింది. తనకు 17 ఏళ్ల వయసు వచ్చినప్పుడు 1906 లో హిట్లర్ తల్లి చనిపోతుంది. దీంతో హిట్లర్ లైఫ్ ఒక్కసారిగా మారిపోతుంది. ఆ తర్వాత బతకడం కోసం హిట్లర్ పోస్ట్ కార్డులు అమ్మేవాడు. కొన్నేళ్ల తర్వాత హిట్లర్ తండ్రి కూడా చనిపోతాడు. దీంతో తనకు ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. బతకడం కోసం కూలీ పనులు చేయడం, వాటర్ కలర్స్ అమ్మడం చేసేవాడు. వాటర్ కలర్స్ ను అమ్మేసమయంలో కలర్స్ ను చూసి చూసి తనను అర్టిస్ట్ ను చేసింది. హిట్లర్ మనసు పెయింటింగ్ వైపు మళ్లింది.

What are the secrets about Hitler History that no one knows

What are the secrets about Hitler History that no one knows

దీంతో వియన్నాలో ఉన్న ఓ ఫైన్ ఆర్ట్స్ అకాడెమీలో ఉద్యోగిగా చేరేందుకు అర్జీ పెట్టుకున్నాడు కానీ.. హిట్లర్ కు అక్కడ ఉద్యోగ అవకాశం లభించలేదు.ఎన్నో పనులు చేసినా ఉద్యోగం దొరకకపోవడంతో ఆర్మీలో చేరాలని నిర్ణయించుకున్నాడు. ఆర్మీలో చేరే అవకాశం రావడంతో మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీ తరుపున పోరాడే అవకాశాన్ని పొందాడు. ఇదే యుద్ధంలో ఒక రోజు హిట్లర్ కంటికి గాయం అవుతుంది. దీంతో హిట్లర్ ను ఆసుపత్రిలో చేర్పిస్తారు. హిట్లర్ హాస్పిటల్ లో ఉన్న సమయంలో జర్మనీ ఈ యుద్ధాన్ని గెలవలేమని చెప్పి యుద్ధంలో ఓడిపోయినట్టు ప్రకటించింది. జర్మనీ ఓడిపోయినట్టు ప్రకటించడం హిట్లర్ కు నచ్చలేదు. జర్మనీ ఓడిపోవడానికి కారణం జూయిస్ అని అనుకున్నాడు. జూయిస్ అంటే యూధులు. అంటే ఒక ప్రత్యేక సంప్రదాయానికి చెందిన వారు. హిట్లర్ పూర్తిగా కోలుకున్నాక మళ్లీ ఆర్మీలోకి తిరిగి వస్తాడు. హిట్లర్ యుద్ధంలో చూపించిన తెగువకు జర్మనీ ప్రభుత్వం ఫస్ట్ క్లాస్ అవార్డును ఇచ్చి సత్కరించింది.

సైన్యంలోకి వచ్చిన తర్వాత యూధులను పూర్తిగా ధ్వేషించడం ప్రారంభించాడు. ఒక యూదుడు అయిన డాక్టర్ నిర్లక్ష్యం వల్లే తన తల్లి చనిపోయిందని చిన్నప్పటి నుంచే యూధులపై కోపాన్ని పెంచుకుంటాడు. ఎలాగైనా జర్మనీలో యూధులను లేకుండా చేయాలనుకుంటాడు. ఇదే సమయంలో అమెరికన్ బ్యాంకులు.. జర్మనీకి ఇచ్చిన లోన్స్ ను తిరిగి తీసుకోవడం ప్రారంభించాయి. దీంతో జర్మనీ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. దీంతో దేశవ్యాప్తంగా ప్రభుత్వంపై పూర్తి స్థాయి వ్యతిరేకత మొదలైంది. ఇవన్నీ జరుగుతున్న సమయంలో నాజీ అనే ఒక రాజకీయ పార్టీతో హిట్లర్ చేతులు కలిపాడు. నాజీ పార్టీ లీడర్ కు కూడా యూధులు అంటే నచ్చదు. అందుకే హిట్లర్ ఆ పార్టీలో చేరాడు. ఆ పార్టీ తరుపున ప్రచారం ప్రారంభించాడు.  ప్రజల్లో పాపులారిటీ తెచ్చుకున్నాక అప్పటి ప్రెసిడెంట్ ను కలిసి తన సపోర్ట్ ను ఇస్తున్నట్టు చెప్పి.. ప్రభుత్వం నుంచి చాన్సెలర్ పదవిని పొందాడు. ఆ తర్వాత గవర్నమెంట్ మొత్తాన్ని తనవైపునకు తిప్పుకునేలా చేశాడు.

హిట్లర్ చెప్పినట్టు నడిచేలా పరిస్థితులను పూర్తిగా మార్చేశాడు. తన టార్గెట్ అయిన యూధులపై ఎక్కు పెట్టాడు. జర్మనీ పవర్స్ మొత్తం తన చేతుల్లోకి తెచ్చుకున్నాక తన మాట ఒక శాసనంలా మారిపోయింది. యూధులు కనిపిస్తే నిర్దాక్షిణ్యంగా చింపేసేవాడు. సైన్యాన్ని పేయమనేవాడు. అందరినీ ఊచకోత కోశాడు. జర్మనీలో హిట్లర్ పేరు వినిపిస్తే ప్రజలు వణికిపోయేవారు. ప్రపంచాన్ని మొత్తం ఏలడం కోసం రెండో ప్రపంచ యుద్ధాన్ని మొదలయ్యేలా చేశాడు కానీ.. రెండో ప్రపంచయుద్ధం జరుగుతుండగా మధ్యలోనే తాను ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు? హిట్లర్ జీవితంలో ఉన్న లవ్ స్టోరీ ఏంటి? ఆ అమ్మాయి ఎవరు? హిట్లర్ శృం… రహస్యాలు ఏంటి అనేవి పార్ట్ 2 వీడియోలో వివరిస్తాం. ఈ వీడియో మీకు ఎంతో కొంత సమాచారాన్ని అందించిందని మేము భావిస్తున్నాం. ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన వీడియోలను ఈ చానెల్ లో మీకోసం త్వరలో అందిస్తాం.

Also read

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది