Rishi Sunak : రిషి సునక్ ఏ కులం వాడు??
Rishi Sunak : రిషి సునక్ బ్రిటన్ కొత్త ప్రధాని గా ఎంపిక అవడంతో భారత దేశంలో సంబరాలు అంబరాన్నంటాయి. మనని 200 ఏళ్లకు పైగా నిరంకుశంగా పాలించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని మన భారతీయుడు పాలించే రోజు వచ్చింది. రిషి సునక్ బ్రిటన్ కొత్త ప్రధానిగా ఎంపికయ్యాడు. అయితే కొందరు నెటిజన్లు కొత్తగా ఎంపికైన బ్రిటిష్ ప్రధానమంత్రి రిషి సునక్ ఎవరు ఎక్కడి వారు అని ఆరా తీస్తున్నారు. చాలామంది హిందూ నిపుణులు పేరు అది సౌనక్ అని ఉండాలి సునక్ అని కాదు అంటున్నారు. సంస్కృతంలో సునక్ అనే పేరుకు కుక్క అని అర్థం. అయితే సౌనక్ అంటే హిందూ పురాణాలలో ఒక సాధువు పేరు.
కొత్తగా ఎన్నికైన బ్రిటన్ ప్రధానమంత్రి పేరు పై సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో చర్చలు కొనసాగుతున్నాయి. ఇండియాలో సర్వసాధారణంగా జరిగినట్లుగా బ్రిటిష్ విద్యా రికార్డులలో అతని పేరు తప్పుగా రాసి ఉండవచ్చని కొందరు అంటున్నారు. అయితే కొందరు సునక్ అనేది పంజాబ్లోని అతని పూర్వీకుల ఇంటి పేరు అని అంటున్నారు. హిందూ పురాణాలలో రిషి సునక్ తో సంబంధం లేదని ఊహిస్తున్నారు. ఇకపోతే చాలామంది భారతీయులు కొత్తగా ఎన్నికైన బ్రిటిష్ ప్రధాని మంత్రి రిషి సునక్ కులం కోసం ఆసక్తిగా ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఇదే గూగుల్లో ట్రేండింగా మారింది.
నిజానికి అతను బ్రాహ్మణుడైన అక్షతామూర్తిని పెళ్లి చేసుకున్నాడు. అయితే రిషి కులం ఇంకా ఎవరికీ తెలియదు. ఆయన పంజాబీ అని అంటున్నారు. రిషి సునక్ శాకాహారుడు టీటోటేలర్ అని తెలిసి అసలు కులాన్ని ప్రజలకు వెల్లడించినప్పటికీ అతను బ్రాహ్మణ జీవితాన్ని గడుపుతున్నాడని చాలామంది అనుకుంటున్నారు. అయితే అతడు బ్రాహ్మణుడు అని ఎవరు కరెక్ట్ గా చెప్పలేరు. బ్రిటన్ ప్రధానమంత్రి స్థాయికి ఎదిగిన మన రిషిని కులం పేరుతో కొందరికే పరిమితం చేసి గొప్పలు చెప్పుకునే వాళ్ళు ఇంకా ఉన్నారు.