Rishi Sunak : బ్రిటన్ బడ్జెట్‌లో రిషి సునక్ మార్క్.. ఆర్థిక వ్యవస్థ బలోపేతానికే మొగ్గు.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Rishi Sunak : బ్రిటన్ బడ్జెట్‌లో రిషి సునక్ మార్క్.. ఆర్థిక వ్యవస్థ బలోపేతానికే మొగ్గు..

 Authored By mallesh | The Telugu News | Updated on :28 October 2021,10:50 pm

Rishi Sunak : కరోనా మహమ్మారి సృష్టించిన అల్లకల్లోలం వల్ల అగ్రరాజ్యం అమెరికా USA ( United States ) United States of America తర్వాత అత్యంత తీవ్రంగా నష్టపోయిన దేశంగా బ్రిటన్ ఉంది. ఈ క్రమంలోనే యూకే ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకుగాను ఆ దేశ ఆర్థిక మంత్రి, భారత India సంతతికి చెందిన రిషి సునక్ ప్రయత్నిస్తున్నారు.తాజాగా రిషి సునక్ Rishi Sunak హౌస్ ఆఫ్ కామన్స్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా దేశ అభివృద్ధికి సంబంధించిన కీలకమైన ప్రకటనలు చేశారు. యూకే ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ద్రవ్యోల్బణం పెరిగే చాన్సెస్ ఉన్నాయని, ఈ సందర్భంలోనే వాటిని తట్టుకునేందుకుగాను తగు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. అందులో భాగంగానే 150 బిలియన్ల పెట్టుబడులను ఆవిష్కరిస్తున్నట్లు తెలిపారు.

rishi sunak key decisions on United Kingdom economy

rishi sunak key decisions on United Kingdom economy

ఇక హాస్పిటాలిటీ ఇండస్ట్రీకి ఉపశమనం కలిగించారు. జాతీయ జీవన వేతనాన్ని పెంచుతున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటన మేరకు వేతనాలు 9.50 పౌండ్లు పెరగనున్నాయి. బ్రిటన్ britain ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగంగా కోలుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇకపోతే పబ్లిక్ ఫైనాన్స్, రుణం కంట్రోల్‌లోనే ఉన్నాయని, ఎంప్లాయ్‌మెంట్ అందరికీ అందుతున్నట్లు వివరించాడు. ఇకపోతే ఉపాధి కల్పన విషయమై ప్రత్యేకమైన దృష్టి సారించినట్లు తెలిపారు. నైపుణ్యాలను మెరుగుపరచడంతో పాటు ఉద్యోగాలను సృష్టించడం, కొత్త ఇళ్లు, ఆస్పత్రులు, స్కూల్స్ నిర్మాణాలకు పెద్ద పీట వేశారు. ఇకపోతే మందుబాబులకు కాస్తంత ఉపశమనం కలిగించారనే చెప్పొచ్చు. వైన్లపై డ్యూటీ ప్రీమియం రద్దు చేయడంతో పాటు బీర్లపై మూడు పెన్స్ తగ్గించేశారు.

Rishi Sunak : ఆర్థిక వ్యవస్థ బలమైన వృద్ధికి రిషి సునక్ హామీ..

rishi sunak key decisions on United Kingdom economy

rishi sunak key decisions on United Kingdom economy

ఇటువంటి నిర్ణయాలతో ప్రజల్లో ఇంకా మంచి గుర్తింపు వచ్చే చాన్సెస్ కనబడుతున్నాయి. ఇక కొవిడ్ మహమ్మారి సృష్టించిన భయానక పరిస్థితుల సమయంలో నేషనల్ హెల్త్ సర్వీస్‌కు బడ్జెట్‌లో భారీ కేటాయింపులు చేశారు. ఆ క్రమంలోనే ప్రజెంట్ వంద కమ్యూనిటీ డయాగ్నోస్టిక్ సెంటర్స్‌లో వసతుల కల్పనకు పెద్ద పీట వేశారు. ఇందుకుగాను 5.9 మిలియన్ పౌండ్లను కేటాయించారు. ఇకపోతే విద్యారంగం కోసం 4.7 బిలయన్లు కేటాయించారు.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది