Dream : కలలో పాము కనపడితే నిద్ర లేచిన 12 గంటల్లో ఇది జరుగుతుంది .. చాలా జాగ్రత్త..!!
Dream : చాలామందికి రాత్రిపూట నిద్రపోయినప్పుడు కలలు వస్తూ ఉంటాయి. ఇవి ప్రతి ఒక్కరి జీవితంలో చాలా సాధారణమైనవి. కలలు ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తాయి. కొంతమందికి నిద్రపోయినప్పుడు కలలు వచ్చిన అవి లేచాక అస్సలు గుర్తుండవు. కలలో ఒక్కోసారి మనకు మంచి ఉద్యోగం వచ్చినట్లు లేదా ఇల్లు కట్టుకున్నట్లు వస్తూ ఉంటాయి. అయితే కొన్నిసార్లు మనకు పీడ కలలు వస్తూ ఉంటాయి. నిద్రలోనే ఉలిక్కిపడి లేస్తాము. భయంకరమైన పీడకలలు వచ్చినప్పుడు ఆ రాత్రి నిద్ర కూడా సరిగ్గా పట్టదు.
ఏ సింహమో మనల్ని వెంటాడుతున్నట్లు, పాములు తరుముతున్నట్లు ఇలా భయంకరమైన కలలు వస్తూ ఉంటాయి. ఒక్కోసారి కలలో వచ్చేది నిజమవుతాయేమో అన్నట్లు భయంగా అనిపిస్తుంది. అయితే మన కలలో వచ్చే వాటిని బట్టి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి అనేది స్వప్న శాస్త్రం చెబుతోంది. అయితే కలలో పాము కరిచినట్లు వస్తే జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో అని స్వప్న శాస్త్రం చెబుతుంది. నిజానికి అందరికీ పాము అంటే చాలా భయమేస్తుంది. పాము కలలో కనిపించిన చాలా భయపడి పోతుంటాం.
కలలో నల్లపాము కనబడితే భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయి. అలాగే పాముని కనుక కలలో చంపితే శుభం జరుగుతుంది. అలాగే అనుకున్న పనులలో విజయాన్ని సాధిస్తారు. ఒకవేళ కలలో పాము ముంగీసా కొట్టుకున్నట్లు కనిపిస్తే అది ఆశుభానికి సంకేతం. అలాగే కలలో పాముని పట్టుకున్నట్లు వస్తే అది శుభానికి సంకేతం. అనుకున్న పనులు పూర్తవుతాయి. పదేపదే పాములు కలలోకి వస్తే పితృ దోషం ఉన్నట్లు అర్థం. పాము కాటు వేసినట్లు వస్తే వ్యాపారంలో, ఉద్యోగంలో ఇబ్బందులు వస్తాయని అర్థం.