Scorpion | కలలో తేలు కనిపిస్తే అర్థం ఏమిటి .. స్వప్నశాస్త్రం చెప్పే విశేషాలు ఇవే..!
Scorpion | సాధారణంగా నిద్రించే సమయంలో మనకు ఎన్నో రకాల కలలు వస్తాయి. కొందరికి పగలే కలలు కనిపిస్తే, మరికొందరికి రాత్రి పూట ఎక్కువగా కలలు వస్తుంటాయి. కలలు రావడం సహజం. అయితే, వాటికి మన జీవితంతో కూడా ఒక ముడి ఉందని స్వప్నశాస్త్రం చెబుతోంది.స్వప్నశాస్త్రం ప్రకారం, మనం ఏ విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తామో, ఎవరి గురించి ఎక్కువగా ఆలోచిస్తామో, వాటికే సంబంధించిన సంకేతాలు మనకు కలల్లో కనిపిస్తాయి. అలాంటి వాటిలో “తేలు” కూడా ఒకటి.
#image_title
విశేషాలు ఏంటంటే..
తేలు అనేది ప్రమాదకరమైన ప్రాణి. వాస్తవ జీవితంలో తేలు కుడితే భయంకరమైన నొప్పి వస్తుంది. కానీ కలలో తేలు కనిపించడం మాత్రం వేరే అర్థం కలిగిస్తుంది.
తేలు కనిపించడం అంటే:
స్వప్నశాస్త్రం ప్రకారం, తేలు కలలో కనిపిస్తే మీ జీవితంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయనే సూచన. కానీ అదే సమయంలో మీరు ఆ సమస్యలను జయించి విజయం సాధిస్తారని కూడా దీని అర్థం. అంటే ముందస్తు హెచ్చరికగా ఈ కలను భావించవచ్చు.
తేలు కుట్టినట్లు కల కనడం అంటే:
మీకు తేలు కుట్టినట్లు, మీరు బాధతో ఏడుస్తున్నట్లు కనిపిస్తే — అది భవిష్యత్తులో సవాళ్లు, ఆర్థిక ఇబ్బందులు లేదా వ్యక్తిగత జీవితంలో ఒత్తిడులు ఎదురవుతాయని సూచిస్తుంది.
అయితే స్వప్నశాస్త్రం ఈ కలలను కేవలం హెచ్చరికలుగా తీసుకోవాలని, భయపడాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. మన ఆలోచనల ఆధారంగా మన కలలు రూపం దాల్చుతాయని, సానుకూల దృక్పథంతో ముందుకు సాగితే ప్రతికూల సంకేతాలూ మంచివి అవుతాయని వారు సూచిస్తున్నారు.