Dream : శ్రావణ మాసంలో పాములు కలలో వస్తే, దానీ రంగును బట్టి మీకు ఏలాంటి ఫలితం వస్తుందో తెలుసా..?
Dream : మనకి కలలు వచ్చినప్పుడు వాటిలో అనేక దృశ్యాలు మనకు కనిపిస్తాయి. కనిపించేటటువంటి అనేక రకాలైనటువంటి దృశ్యాలు మన జీవితంపై ప్రభావాన్ని చూపిస్తాయి. అయితే ఒక్కోసారి కలలో మనకి పాములు కనిపిస్తూ ఉంటాయి. మరి అలా పాములు ఎలాంటి బంగిమలో కనిపిస్తే ఎటువంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి. పాముని ఎలా చూడడం వల్ల ఎలాంటి అర్థం ఉంటుంది. ఈ వివరాలన్నీ మనం ఇప్పుడు చూసేద్దాం.. నిద్రపోయిన తర్వాత వచ్చేవి కలలు కావు ఏవైతే నిద్ర పోనివ్వము అవే అసలైన కలలు అని దివంగత నేతజీ చెప్పారు. ఇప్పుడు నిద్రలో వచ్చే కలల గురించి తెలుసుకుందాం. నిద్ర రావడం ప్రతి మనిషిలోనూ సహజమే ఇది మన వాస్తవ జీవితంలోని సంఘటనలను తెలియజేస్తాయి.కలలో పాము కనిపిస్తే పరిహారాలు తప్పనిసరి స్వప్న శాస్త్ర ప్రకారం ఎవరికైతే జంట పాములు కనిపిస్తాయో అది అశుభంగా పరిగణించాలి.
ఎందుకంటే ఇది పెద్ద దేవతలను సూచిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో మర్చిపోయి కూడా మనసులో పూర్వీకుల గురించి తప్పుడు ఆలోచనలు తీసుకురాకుండా ఉంటే మంచిది. ఇలాంటి కలలు ఎప్పుడైనా వచ్చినట్లయితే పితృదేవతల పేరు మీదుగా దీపాన్ని వెలిగించాలి. లేకుంటే అనవసర సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. స్వప్న శాస్త్ర ప్రకారం పాము కలలో ఎవరైనా వ్యక్తిపై దాడి చేసినట్లయితే అది దుర్మార్గంగా పరిగణిస్తారు. అలాంటి కళ జీవితంలో పెద్ద ఇబ్బందుల్ని సూచిస్తుంది. పాములను చంపిన తరిమిన మీకు రాబోతున్న సంక్షోభం గురించి ఆందోళన చెందుతున్నారని అర్థం.
స్వప్న శాస్త్ర ప్రకారం మీకు కలలో తెల్లని లేదా బంగారు రంగులో ఉన్న పాము కనిపిస్తే మీరు పెద్ద సంపదను పొందబోతున్నారని అర్థం. అయితే పామును పదేపదే చూస్తే పితృ దోషం ఉందని అర్థం. ఒక కలలో పాము పైకి ఎక్కినట్లు కనిపిస్తే ప్రమోషన్ పొందుతున్నారని అర్థం. వ్యాపారులకు వ్యాపారం మెరుగుపడుతుందని అర్థం. పాము కాటు వేసినట్టు కల వస్తే ఆ కష్టాలు మనల్ని విడిచిపెట్టబోతున్నాయని అర్థం. స్వప్నంలో తెల్లపాము కాటేస్తే అది శుభప్రదంగా భావిస్తారు. ఈ విధంగా మొత్తానికి కలలు పాములు రావడం వల్ల చాలా వరకు కూడా అదృష్ట సంకేతాలు ఉంటే కొన్ని మాత్రం జాగ్రత్తలు చెప్తున్నాయని చెప్పుకోవాలి. కలలో ఎర్రని పాము వస్తే మంచిది ఎర్రటి పాముని శక్తికి చిహ్నం. జీవితంలో మరింత బాధ్యత వహించాలని సూచన. మీరు చేసే పని గురించి మరింత జాగ్రత్తగా ఉండాలి.
లక్ష్యాలపై ఎక్కువ దృష్టి పెట్టాలి. కలలో ఆకుపచ్చ పాములు వస్తే వైద్య సంబంధం కలిగి ఉంటాయి.అది తాత్విక చికిత్స అని అర్దం. ఇది మాత్రమే కాదు కలలో ఆకుపచ్చ పాముని చూడడం వ్యక్తిగత పెరుగుదల ఆధ్యాత్మిక మేలుకొలుపు వైపు కదలకని కూడా సూచిస్తుంది.జ్యోతిష్య శాస్త్ర ప్రకారం పసుపు రంగు పాము కనిపించిన సానుకూల సంకేతం ఆనందంతో ముడిపడి ఉంటుంది. తెల్లని పాము రహస్యాన్ని సూచిస్తుంది. భవిష్యత్తులో మీరు కొన్ని పెద్ద రహస్యాలు దాచిపెడతారని దీని అర్థం.