JC Brothers : రాత్రి నిద్ర లేదు.. పగలు ప్రశాంతత లేదు.. జేసీ బ్రదర్స్ కష్టాలు !
JC Brothers : జేసీ బ్రదర్స్ అంటేనే అనంతపురంలో ఓ రేంజ్ ఉన్న రాజకీయ నాయకులు. కానీ.. ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడు వాళ్లు టైమ్ బ్యాడ్ గా నడుస్తోంది. జేసీ బ్రదర్స్ కు అనంతపురంలో అందరూ శత్రువులే అయ్యారు. కేతిరెడ్డి కూడా చిరకాల ప్రత్యేర్థే. ఇప్పుడు ధర్మవరం, తాడిపత్రిలోనూ కేతిరెడ్డి ఫ్యామిలీ ఉంది. కానీ.. జేసీ బ్రదర్స్ ఇప్పుడు తాడిపత్రికే పరిమితం అయిపోయారు.
అందుకే జేసీలపై ఒంటి కాలితో లేస్తున్నారు కేతిరెడ్డి వర్గం. నిజానికి వీళ్ల మధ్య ఉన్న వైరం ఇప్పటిది కాదు. చాలా ఏళ్ల నుంచి ఉన్నదే. అది చిరకాల శతృత్వం అనే చెప్పుకోవాలి. వైఎస్సార్ హయాంలో కేతిరెడ్డి సూర్యప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ లో ఓ వెలుగు వెలిగారు. ఆ తర్వాత ఆయన టీడీపీలోకి వెళ్లారు. కానీ.. ఆయన హత్య టీడీపీలో ఉన్నప్పుడే జరిగింది. అప్పటి నుంచి టీడీపీ, కాంగ్రెస్ నేతల మధ్య వర్గ పోరు కొనసాగుతూ వచ్చింది. అది కాస్త ఇప్పుడు వైసీపీ, టీడీపీ మధ్యకి షిఫ్ట్ అయింది.
JC Brothers : తాడిపత్రి నుంచి సూర్యప్రతాప్ రెడ్డి సోదరుడు పెద్దారెడ్డి తాడిపత్రి నుంచి గెలిచారు
అయితే.. 2019 ఎన్నికల్లో కేతిరెడ్డి సూర్యప్రతాప్ రెడ్డి సోదరుడు పెద్దారెడ్డి.. తాడిపత్రి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అది జేసీ కంచుకోట అని తెలిసి కూడా అక్కడ బరిలోకి దిగి పెద్దారెడ్డి ఎమ్మెల్యే అయ్యారు. మరోవైపు ధర్మవరం నుంచి కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి కూడా చాలా యాక్టివ్ గా ఉన్నారు. ఆయన కేవలం ధర్మవరానికే పరిమితం కాలేదు. తాడిపత్రిలోనూ ఆయన ఇన్వాల్వ్ అవుతున్నారు. తన బాబాయి పెద్దారెడ్డి తరుపున రాజకీయాల్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. వీళ్లిద్దరూ కలిసి జేసీ సోదరులకు నిద్రలేకుండా చేస్తున్నారు. మరి ఇలాంటి నేపథ్యంలో 2024 ఎన్నికల్లో అనంతపురం రాజకీయాల్లో జేసీ బ్రదర్స్ వర్సెస్ కేతిరెడ్డి ఫ్యామిలీ అన్నట్టుగా ఉంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో?