Paneer | పనీర్ తినడం ఆరోగ్యకరమే కానీ… రోజూ తినడం మంచిదా? నిపుణుల హెచ్చరికలు ఇవే! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Paneer | పనీర్ తినడం ఆరోగ్యకరమే కానీ… రోజూ తినడం మంచిదా? నిపుణుల హెచ్చరికలు ఇవే!

 Authored By sandeep | The Telugu News | Updated on :22 September 2025,9:00 am

Paneer | పనీర్ అంటే చాలా మందికి ప్రియమైన ఆహారం. ముఖ్యంగా శాకాహారులు ప్రోటీన్ కోసం ఎక్కువగా దీనిపై ఆధారపడతారు. కానీ పనీర్‌ను రోజూ తినడం వల్ల మేలుకంటే ముప్పే ఎక్కువ అని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోజూ పనీర్ తీసుకోవాలా? వద్దా? అనే సందేహం చాలా మందిలో ఉంటుంది.

#image_title

జీర్ణక్రియపై ప్రభావం

పనీర్ పాలతో తయారవుతుంది. కానీ చాలామందిలో లాక్టోస్ లేదా కేసిన్ జీర్ణం కాకపోవడం వల్ల కడుపు ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలు తలెత్తుతాయి.

నాణ్యతపై అనుమానాలు

ఈరోజుల్లో వాడే పాలు గతంలా స్వచ్ఛంగా ఉండవు. వీటిలో హార్మోన్లు, కృత్రిమ రసాయనాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాంటి పాలతో చేసిన పనీర్ తినడం వల్ల అవాంఛిత పదార్థాలు శరీరంలోకి చేరే ప్రమాదం ఉంది.

ప్రమాదకర ఆరోగ్య సమస్యలు

పనీర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కాలేయంపై ఒత్తిడి, జీర్ణ సమస్యలు పెరిగే అవకాశం ఉంది. డయాబెటిస్, హై కొలెస్ట్రాల్, ఫ్యాటీ లివర్ ఉన్నవారు పనీర్ తీసుకునే విషయంలో ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి. పనీర్ ఆరోగ్యానికి మంచిదే. కానీ మితంగా తీసుకోవాలి. ప్రోటీన్ కోసం కేవలం పనీర్‌పైనే ఆధారపడకుండా, మూడుళ్లు, పెసలు, దోసకాయ, శనగలు వంటి ఇతర ప్రోటీన్ వనరులను కూడా ఆహారంలో చేర్చాలి. రోజూ పనీర్ తినడం వల్ల లాభాలు తక్కువగా ఉండి, దీర్ఘకాలంలో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది