Pawan Kalyan : ఈ ఒక్క లాజిక్ ని పవన్ కళ్యాణ్ ఎలా మిస్ అయ్యాడో అర్ధం అవ్వట్లేదు…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Pawan Kalyan : ఈ ఒక్క లాజిక్ ని పవన్ కళ్యాణ్ ఎలా మిస్ అయ్యాడో అర్ధం అవ్వట్లేదు…!!

 Authored By kranthi | The Telugu News | Updated on :2 July 2023,8:00 pm

Pawan Kalyan : ప్రస్తుతం ఏపీలో ఒకటే చర్చ. పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర గురించే చర్చ. ఎందుకంటే.. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నా ఇప్పటి నుంచే ప్రజల్లోకి వెళ్తూ పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర చేపడుతున్నారు. ప్రజలు కూడా ఆయన సభకు బాగానే వస్తున్నారు. పవన్ కళ్యాణ్ సభకు వచ్చిన వాళ్లు బాగానే చప్పట్లు కొడుతున్నారు. ఇక.. పవన్ కళ్యాణ్ ప్రసంగాలు చూస్తే నిజంగానే ఆయనలోని మరో వ్యక్తిని చూస్తారు. అంతలా ఆయన రెచ్చిపోయి మరీ మాట్లాడుతున్నారు.

ముఖ్యంగా ఆ భీమవరం సభలో అయితే ఆయన గర్జించారనే చెప్పుకోవాలి. మిస్టర్ జగన్ అంటూ సీఎం జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. నీ సీక్రెట్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయంటూ చెప్పుకొచ్చారు. వామ్మో.. పవన్ కళ్యాణ్ సీఎం జగన్ పై అంతలా రెచ్చిపోయి మాట్లాడటం ఇప్పటి వరకు చూడలేదు. అసలు నీ సీక్రెట్స్ అన్నీ చెబితే మామూలుగా ఉండదు. ఎవరినైనా నీ వాళ్లను పంపు.. మొత్తం చెబుతా అంటూ పవన్ కళ్యాణ్ రెచ్చిపోయి మరీ మాట్లాడారు. జగన్ పర్సనల్ సీక్రెట్స్, వ్యక్తిగత విషయాలు మనకెందుకు. అసలు ప్రజలకు ఎందుకు. వాళ్లకు అవసరమా? ప్రజలకు కావాల్సింది ఒకటే.

what if people think about pawan kalyan janasena party

what if people think about pawan kalyan janasena party

Pawan Kalyan : జగన్ వ్యక్తిగత విషయాలు ఎవరికి కావాలి?

ప్రభుత్వంలో ఉన్న నాయకులు ప్రజల కోసం పని చేస్తున్నారా లేదా అని. ఆ సీక్రెట్స్ కోసం పవన్ కళ్యాణ్ అంతలా నోరు చించుకోవాలా? అంత అవసరం ఉందా అంటూ ప్రజలు అంటున్నారు. నిజంగా అవి జగన్ సీక్రెట్స్ అయితే అవసరమే లేదు. వైసీపీ పాలనలో తప్పులు ఉంటే చెప్పండి. జగన్ తన పాలనలో ఏవైనా తప్పులు చేస్తే చెప్పండి. ప్రభుత్వ పాలనలో తప్పులు ఉంటే ఎత్తి చూపండి.. అప్పుడు జనాలు వింటారు కానీ.. ఇలా పర్సనల్ సీక్రెట్స్ అంటూ ఏదో చెప్పబోతే అటువంటి విషయాలు జనాలకు అవసరం లేదు పవన్ కళ్యాణ్. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావు నువ్వు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది