Agneepath : కేంద్రం తీసుకువచ్చిన కొత్త ఆర్మీ పథకం అగ్నిపథ్ కి వ్యతిరేకంగా యువత తీవ్ర ఆందోళనలు చేపడుతున్నారు. బీహార్, మధ్యప్రదేశ్ హర్యానా, తెలంగాణ రాష్ట్రాల్లో మరింత తీవ్ర స్థాయికి చేరుకుంది. యువకులు ఆందోళనలో భాగంగా ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. సికింద్రబాద్ రైల్వే స్టేషన్ లో పలు రైళ్లకు నిప్పు పెట్టారు. ఆందోళనలు అదుపు చేసిన పోలీసులు పలువురిపై కేసులు నమోదు చేశారు. అసలు అగ్నిపథ్ స్కీమ్ ఎంటీ.. ? ఎందుకు ఆందోళనలు చేస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.. దేశ రక్షణ విభాగాలైన ఆర్మీ, నేవీ, వాయు స్వల్పకాలిక ప్రతిపాదకన సైనికులను నియమించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన పథకమే ఈ అగ్నిపథ్.
బిపిన్ రావత్ సలహాతో కేంద్రం ఈ పథకాన్ని తీసుకురాగా కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రారంభించారు. రక్షణశాఖ తెలిపిన సమాచారం ప్రకారం యువతకు సైన్యంలో అవకాశం ఇచ్చేందుకు కేంద్రం తీసుకొచ్చిన పథకమే అగ్నిపథ్. ఇందులో భాగంగా నియమించే సైనికులను అగ్నివీరులు అని పిలుస్తారు. వీరు నాలుగేళ్ల పాటు సైన్యంలో పని చేస్తారు. ఆ తర్వాత వారి పని బట్టి మొత్తం అగ్నివీరుల్లో 25 శాతం మందిని రిటెయిన్ చేస్తారు. అంటే.. ప్రతి 100 మందిలో 25 మందిని రెగ్యులరైజ్ చేస్తారు. వాళ్లు 15 సంవత్సరాల పాటు నాన్ ఆఫీసర్ హోదాలో పని చేయవచ్చు.
అగ్నిపథ్ పథకం కింద సైన్యంలో చేరేవారికి మొదటి ఏడాది నెలకు రూ. 30 వేలు ఇస్తారు. ఇందులో చేతికి రూ.21 వేలు ఇస్తారు. మిగిలిన రూ. 9 వేలు అగ్నివీర్ కార్పస్ ఫండ్‌లో జమ చేస్తారు. రెండో ఏడాది నెలకు రూ. 33 వేల జీతం అందజేస్తారు. ఇందులో 30 శాతం అంటే రూ.9900 కార్పస్ ఫండ్‌లో జమ చేస్తారు. మూడో ఏడాదిలో ప్రతి నెలా ఇచ్చే రూ.36, 500లో రూ.10,980 కార్పస్ ఫండ్‌లో జమ చేస్తారు. నాలుగో ఏడాది నెలకు రూ. 40 వేలు జీతం ఇస్తారు. ఇందులో రూ.12000 కార్పస్ ఫండ్‌కి జమ చేస్తారు. ఇలా నాలుగేళ్లలో మొత్తం రూ. 5.02 లక్షలు కార్పస్ ఫండ్‌లో జమ అవుతాయి. దీనికి మరో రూ. 5.02 లక్షలు అదనంగా కేంద్రం జమ చేస్తుంది. ఈ మొత్తానికి వడ్డీ కలుపుకుని నాలుగేళ్ల తర్వాత రూ.11.71 లక్షలు క్యాండిడేట్ కి చెల్లిస్తారు. ఈ మొత్తంపై ఇన్ కం ట్యాక్స్ మినహాయింపు ఉంటుంది. ఈ నాలుగేళ్ల కాలంలో ఆర్మీ నిబంధనల ప్రకారం ఇతర అలవెన్సులు, సౌకర్యాలు ఉంటాయి. నాలుగేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న వారికి సమగ్ర ఆర్థిక ప్యాకేజ్ ఉంటుంది.
పదిహేడున్నర ఏళ్ల నుంచి 21 ఏళ్ల మధ్య వయసు ఉన్నయువకులు సైన్యంలో చేరవచ్చు. పదో తరగతి లేదా ఇంటర్ పాసైన యువతీ యువకులు అర్హులు. ఇక ప్రస్తుతానికికైతే అబ్బాయిలకు మాత్రమే అవకాశం ఇస్తున్నారు. తర్వాత అమ్మాయిలకు కూడా ఈ అవకాశం కల్పిస్తామని కేంద్రం తెలిపింది. సైన్యంలో ఉండగా ఎలా చనిపోయినా రూ.48 లక్షల జీవిత బీమా ఉంటుంది. ఈ ఇన్సూరెన్స్ కోసం అభ్యర్థులు ప్రీమియం చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. విధి నిర్వహణలో చనిపోతే రూ.44 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా అదనంగా చెల్లిస్తారు. సైన్యంలో ఉండగా శారీరక అంగవైకల్యం కలిగినా పరిహారం అందిస్తారు. వైకల్యం 100 శాతం ఉంటే రూ.44 లక్షలు, 75 శాతం ఉంటే రూ.25 లక్షలు, 50 శాతం ఉంటే రూ.15 లక్షలు పరిహారంగా అందజేస్తారు.
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
This website uses cookies.