Obstructive Sleep Apnea : అబ్ స్ట్రక్టివ్ స్లీవ్ అప్నియా అంటే ఏంటి? బప్పి లహరి మృతికి.. ఈ వ్యాధికి సంబంధం ఏంటి?
Obstructive Sleep Apnea : బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ బప్పీ లహరీ ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే కదా. ఆయన మృతి చెందడానికి ప్రధాన కారణం అబ్ స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా. ఈ వ్యాధి వల్లనే బప్పి లహరి చనిపోయారు. అసలు.. ఈ వ్యాధి ఎందుకు వస్తుంది. ఈ వ్యాధి వల్ల కలిగే నష్టాలు ఏంటి.. అనే దానిపై ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తోంది.అబ్ స్ట్రక్టివ్ స్లీవ్ అప్నియా అంటే గుండె పనితీరు ఒక్కసారిగా ఆగిపోవడం. నిద్రపోయేటప్పుడు చాలామంది గురక పెడుతుంటారు కదా. దాన్నే మనం స్లీప్ అప్నియాగా పిలుస్తుంటాం. చాలామంది గురక పెడతారు కానీ.. కొందరిలో ఆ గురక చాలా ప్రమాదంగా మారుతుంది. స్లీప్ అప్నియాలో మూడు రకాలు ఉంటాయి.
ఒకటి అబ్ స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా, సెంట్రల్ స్లీప్ అప్నియా ఇంకోటి కాంప్లెక్స్ స్లీప్ అప్నియా. అబ్ స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా వల్ల శ్వాసకు సంబంధించిన సమస్యలు వస్తాయి. ఈ వ్యాధితో బాధపడేవాళ్లు పడుకున్న సమయంలో శరీరంలో ఆక్సిజల్ లేవల్స్ తగ్గినప్పుడు శ్వాస నాళాలు కుంచించుకుపోతాయి. అప్పుడే గురక వస్తుంది.ఆ తర్వాత కొద్ద క్షణాల పాటు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారుతుంది. మళ్లీ వెంటనే శ్వాస యాక్టివ్ అవుతుంది. ఒకవేళ శ్వాస ఆగిపోయి.. ఇబ్బంది కరంగా మారి.. మళ్లీ శ్వాస తీసుకోలేకపోతేనే గుండె పోటు వస్తుంది. గుండె ఆగిపోతుంది. దీంతో నిద్రలోనే ప్రాణాలు పోతాయి.
Obstructive Sleep Apnea : ఈ వ్యాధి వస్తే ఏం చేయాలి?
ఈ వ్యాధి వస్తే ఏం చేయాలి? ఈ వ్యాధి నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలి? దీనికి ట్రీట్ మెంట్ కూడా ఉంది. ఈ సమస్యకు చెక్ పెట్టడానికి ఒక పరికరాన్ని ఉపయోగిస్తారు. అదే కంటిన్యూస్ పాజిటివ్ ఎయిర్ అవే ప్రెజర్ థెరపీ. ఈ పరికరంతో శ్వాస తీసుకోవడం ద్వారా ఎదురయ్యే సమస్యలకు చెక్ పెట్టొచ్చు. దీన్ని నోటిలో కొండ నాలుక దగ్గర సెట్ చేస్తారు.ఈ పరికరం ఉంటే.. అబ్ స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా నుంచి తప్పించుకోవచ్చు. నిద్ర సమయంలో వచ్చే సమస్యలను, గురకను తప్పించుకోవచ్చు.