KCR – Thota : హైదరాబాద్.. కేసీయార్-తోట బంధమిదేనా..??
KCR – Thota : తెలంగాణ సీఎం కేసీఆర్ కు, జనసేన కీలక నేత తోట చంద్రశేఖర్ కు మధ్య ఉన్న సంబంధం ఏంటి అనేది ఎవ్వరికీ అంతుపట్టడం లేదు. ఎందుకంటే.. ఇద్దరివి వేరే రాష్ట్రాలు.. వేరే పార్టీలు. కానీ.. ఇద్దరి మధ్య ఎలా బంధం ఏర్పడింది అనేది మాత్రం అంతుపట్టడం లేదు. వీళ్లిద్దరూ కలవాలంటే ఏదో ఒక విషయం ఉండాలి. ఇంతకీ వీళ్లను కలిపిన విషయం ఏంటి అంటూ అందరూ ఆశ్చర్యపోతున్నారు. నిజానికి.. కేసీఆర్ కు, తోటకు మధ్య ఎలాంటి సంబంధం లేదు. కానీ.. ఆయన జనసేన పార్టీని వదిలేసి.. ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా నియామకం అవడంతో అప్పుడు కానీ.. తోట చంద్రశేఖర్ కు, కేసీఆర్ కు మధ్య ఏముందో అందరికీ అర్థం అయింది. అసలు వీళ్లిద్దరి మధ్య ఎలా అనుబంధం కుదిరింది అనేది తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు చెప్పుకొచ్చారు.
ఒక లాండ్ సెటిల్ మెంట్ వీళ్లిద్దరినీ కలిపిందట. మియాపూర్ లో ఉన్న సర్వే నెంబర్ 78 లోని దాదాపు 40 ఎకరాల వివాదాస్పద భూమిని తోట చంద్రశేఖర్ కొన్నారట. దాన్ని కేసీఆరే దగ్గరుండి సెటిల్ చేయించారట. అయితే.. ప్రస్తుతం ఆ భూమి విలువ సుమారు రూ.4 వేల కోట్లని.. వేల కోట్ల రూపాయల విలువైన భూమిని సీఎం కేసీఆర్.. తోటకు కట్టబెట్టడంతో ఒప్పందం ప్రకారం.. ఆయన జనసేనను వదిలేసి బీఆర్ఎస్ పార్టీలో చేరి ఏకంగా ఏపీకి అధ్యక్షుడుగా అయ్యారని రఘునందన్ రావు చెప్పుకొచ్చారు. అంతే కాదు.. చివరకు ఖమ్మంలో జరిగిన బహిరంగ సభ ఖర్చును మొత్తం తోటనే భరించారట. అలాగే.. ఏపీలో బీఆర్ఎస్ పార్టీ విస్తరణ కోసం అయ్యే ఖర్చులను మొత్తం తోటే భరిస్తున్నట్టుగా ఇద్దరి మధ్య ఒప్పందం కూడా కుదిరింది
KCR – Thota : ఖమ్మం బహిరంగ సభ ఖర్చును కూడా తోటే భరించారా?
అంటూ రఘునందన్ చెప్పుకొచ్చారు. అసలు.. రఘునందన్ రావు చేసిన ఆరోపణలు ఎంత వరకు నిజం అనేది తెలియనప్పటికీ.. ఆయన చెప్పిన దాంట్లో మాత్రం లాజిక్ ఉంది అనే చెప్పాలి. ఎందుకంటే.. హైదరాబాద్ ఔట్ స్కర్ట్ ప్రాంతాల్లో తోటకు ఆదిత్యా ఇన్ఫ్రా అనే కన్ స్ట్రక్షన్ కంపెనీ ఉంది. దాని కోసమే ఆయన మియాపూర్ లో ఆ లాండ్ ను కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. అలాగే.. బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు కీలక నేతలతోనూ తోటకు చాలా కాలంగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయట. ఇవన్నీ చూస్తే కేసీఆర్, తోటకు అక్కడే బంధం ఏర్పడిందని ఎమ్మెల్యే చేసిన ఆరోపణలు నిజమే అనిపిస్తున్నాయి.