YS Jagan – Chandrababu : జగన్ వ్యూహంతో చంద్రబాబుకి చెక్..!!
YS Jagan – Chandrababu : ప్రస్తుతం దేశమంతా ఏపీ గురించే మాట్లాడుకుంటోంది. ఏపీలో వస్తున్న పారిశ్రామిక విధానం గురించి, పరిశ్రమల గురించి, ఉద్యోగాలు, పెట్టుబడులు.. ఇలా వైజాగ్ లో జరుగుతున్న సమావేశం గురించే అంతటా చర్చ. మేము కూడా వైజాగ్ కు వచ్చేస్తున్నాం. అక్కడి నుంచే పాలన అంటూ సీఎం జగన్ సమావేశంలోనే స్పష్టంగా చెప్పేశారు. అంతే కాదు.. ఎన్నో సంక్షేమ పథకాలను సీఎం జగన్ ప్రారంభించారు. నిజానికి.. గత ప్రభుత్వం ఏదైనా ప్రారంభిస్తే.. దాన్ని వచ్చే ప్రభుత్వం కంటిన్యూ చేయాల్సి ఉంటుంది.
ఇప్పుడు జగన్ వైజాగ్ కి షిఫ్ట్ అయితే.. వచ్చే ప్రభుత్వం కూడా వైజాగ్ నుంచి పాలన చేయాల్సిందే కదా. ఒకవేళ పుసుక్కున టీడీపీ ప్రభుత్వం వస్తే.. అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఖచ్చితంగా వైజాగ్ నుంచి పాలన చేస్తుందా? నిజానికి.. టీడీపీ హయాంలో తీసుకొచ్చిన అమరావతి క్యాపిటల్ ను తర్వాత అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ ప్రభుత్వం యాక్సెప్ట్ చేయలేదు. అందుకే మూడు రాజధానుల అంశం అంటూ కొత్త నినాదాన్ని తెరమీదికి తెచ్చారు. అయినా కూడా తాడేపల్లి నుంచి మాత్రమే సీఎం జగన్ ఇన్నేళ్లు పాలన చేశారు. రేపు చంద్రబాబు ముఖ్యమంత్రి అయినా అదే కదా పరిస్థితి అని జనాలు అంటున్నారు.
YS Jagan – Chandrababu : అమరావతిని జగన్ యాక్సెప్ట్ చేయలేదు
ఆయన కూడా జగన్ లాగే వైజాగ్ నుంచి పాలన చేయాల్సి ఉంటుంది అంటున్నారు. కానీ.. ఒకవేళ చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వస్తే.. మళ్లీ అమరావతే రాజధాని అని ప్రకటించి.. వైజాగ్ నుంచి తట్టాబుట్టా సర్దేసి అమరావతికి షిఫ్ట్ అవుతారా? అది అసాధ్యం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే జగన్ అధికార వ్యవహారాలన్నింటినీ ఇక్కడికి తీసుకొస్తే.. వెంటనే రాజధానికి మార్చడం సాధ్యం కాదని.. ఒకవేళ కావాలని వాళ్లు రాజధాని మార్చితే మళ్లీ గందరగోళం ఏర్పడుతుందని వైసీపీ నుంచి వస్తున్న మాట. అందుకే.. మళ్లీ తమనే గెలిపిస్తే.. ఇక వైజాగ్ నుంచి పాలన అనేది ఫిక్స్ చేసి.. ఏ ప్రభుత్వం వచ్చినా అక్కడి నుంచే పాలన చేసే విధంగా చర్యలు తీసుకుంటామని వైసీపీ నేతలు ఉత్తరాంధ్ర ప్రజల్లోకి దీన్ని బలంగా తీసుకెళ్తున్నారు.