Pawan Kalyan : 2024 లో జనసేన ఓడిపోతే ఏంటి పరిస్థితి? పవన్ రాజకీయాలకు శాశ్వతంగా దూరం అవుతారా?
Pawan Kalyan : ప్రస్తుతం ఏపీలో ఎన్నికల హడావుడి నెలకొన్నది. నిజానికి ఏపీలో ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది. కానీ.. ఎన్నికల హడావుడి మాత్రం ఇప్పటికే మొదలైంది. పలు రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే ఎన్నికల కోసం సిద్ధం అవుతున్నాయి. వైసీపీ, టీడీపీ అంటే ఆ పార్టీలు ఇప్పటికే అధికారంలోకి వచ్చాయి. ఎన్నికల విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో తెలుసు. కానీ.. జనసేన పార్టీ కొత్త. 2014 లోనే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పటికీ ఇంకా ఆ పార్టీ ఎన్నికల్లో గెలవలేదు. పవన్ కళ్యాణ్ కు ఎన్నికలకు హ్యాండిల్ చేయడంలో కొంచెం అనుభవం కావాలి.
అయితే.. 2014 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ మద్దతు ఇవ్వడం వల్లనే టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఆ విషయం అందరికీ తెలుసు. అయితే.. టీడీపీ అధికారంలోకి రావడం వల్ల పవన్ కళ్యాణ్ కు జరిగిన మేలు ఏంటి అనేది మాత్రం ఎవ్వరికీ తెలియదు. అందుకే అప్పటి నుంచి పవన్ సొంతంగా తన పార్టీనే ఎన్నికల బరిలోకి దించాడు. అయితే… 2019 ఎన్నికల్లో జనసేన సొంతంగా పోటీ చేసింది. అయినప్పటికీ అటు టీడీపీ, ఇటు జనసేన రెండూ ఓడిపోయాయి. వైసీపీ గెలిచింది. మరి.. 2024 ఎన్నికల్లో ఏంటి పరిస్థితి అనేది తెలియదు. మళ్లీ అన్ని పార్టీలు ఒంటరిగా పోటీ చేసి గెలవగలవా? అనేదే పెద్ద ప్రశ్నగా మారింది.
Pawan Kalyan : 2019 లో సొంతంగా పోటీ చేసిన జనసేన
2024 ఎన్నికల్లో వైసీపీని ఓడించేందుకు టీడీపీ, జనసేన కలుస్తాయా? లేక ఒంటరిగానే పోటీ చేస్తాయా? అనేది తెలియదు. ఒకవేళ 2024 ఎన్నికల్లో మళ్లీ వైసీపీనే గెలిస్తే టీడీపీ, జనసేన పరిస్థితి ఏంటి అనేదానిపై కూడా స్పష్టత లేదు. ఒకవేళ జనసేన ఓడిపోతే పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి? ఇంకా రాజకీయాల్లో కొనసాగుతారా? లేక శాశ్వతంగా రాజకీయాలకు గుడ్ బై చెప్పేసి సినిమాలు చూసుకుంటారా? లేక.. అలాగే పార్టీని కంటిన్యూ చేసి 2029 ఎన్నికల వరకు పోరాడుతూనే ఉంటారా? అనేది మాత్రం తెలియదు. ఒకవేళ పొత్తుకు పోతే మాత్రం టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసి ఓడిపోయినా కూడా పవన్ కళ్యాణ్ పై మాత్రం విమర్శలు వచ్చే అవకాశం ఉంది అని తెలుస్తోంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో?