Donation : ఎవరైనా ఇంటికి వస్తే.. ఈ వస్తువులను అస్సలు దానం చేయకండి.. అలా చేస్తే దరిద్రులు అయినట్టే..!
Donation : డొనేషన్.. దానం.. అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న అంటుంటారు పెద్దలు. రక్తదానం కూడా గొప్పదే. దానం చేస్తే ఎన్నో జన్మల పుణ్యం లభిస్తుంది. అందుకే.. చాలామంది తమకు తోచింది దానం చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ఎవరైనా అవసరంలో ఉన్నా.. ఆపదలో ఉన్నా.. వాళ్లకు సాయం చేస్తే దాన్నే దానం అంటారు. చాలామంది అన్నదానం చేస్తుంటారు. నీళ్ల దానం చేస్తుంటారు. రక్త దానం చేస్తుంటారు. వస్త్రాలు దానం చేస్తుంటారు. ఏవైనా వస్తువులు కూడా దానం చేస్తుంటారు. ఇలా.. తమకు తోచిన దానం చేస్తుంటారు.
కొందరు డబ్బులు కూడా దానం చేస్తారు. అయితే.. చాలామందికి తెలియని విషయం ఏంటంటే.. ఏది పడితే అది దానం చేయకూడదట. ఇంటికి ఎవరైనా వస్తే.. ఏది పడితే అది దానం చేయకూడదట. ఇంటికి వచ్చిన వాళ్లకు కొన్ని దానం చేయకూడనివి కూడా ఉంటాయట. అలా చేస్తే లేని దరిద్రం కూడా పట్టుకుంటుందట. మరి.. అలా ఏ ఏ వస్తువులను దానం చేయకూడదో తెలుసుకుందాం రండి.
Donation : దానం చేయకూడని వస్తువులు ఇవే
చాలామంది ప్లాస్టిక్ వస్తువులను దానం చేస్తుంటారు. అయితే.. ప్లాస్టిక్ వస్తువులను దానం చేయకూడదట. అలాగే.. ప్లాస్టిక్ వస్తువుల్లో కూడా ఏదైనా పెట్టి ఇవ్వకూడదట. అలా చేస్తే దరిద్రం వస్తుందట. ప్లాస్టిక్ ఆరోగ్యానికి హానికరం కాబట్టి.. ప్లాస్టిక్ వస్తువుల్లో పెట్టి ఇవ్వకూడదని అంటుంటారు.
చాలామంది చీపురును కూడా దానం చేస్తుంటారు. చీపురును అస్సలు దానం చేయకూడదు. ఎందుకంటే.. చీపురును దానం చేస్తే.. లక్ష్మీదేవి చీపురుతో పాటే బయటికి వెళ్లిపోతుందట. ఇదివరకు సంపాదించిన డబ్బు కూడా చీపురుతో పాటే వెళ్లిపోతుందట. అందుకే.. చీపురును అస్సలు దానం చేయకూడదని అంటారు.
స్టీల్ వస్తువులను అస్సలు దానం చేయకూడదట. ఇంట్లో పాతబడిపోయిన బట్టలను దానం చేస్తుంటారు. పాత బట్టలను అస్సలు దానం చేయకూడదు. పాతవి కాకుండా.. మంచి బట్టలను మాత్రమే దానం చేయాలట. ఏమాత్రం చిరిగినా.. రంధ్రాలు పడిన పాతబట్టలను అస్సలు దానం చేయకూడదట.
చాలా పదునుగా ఉండే వస్తువులు కత్తులు, కత్తెరలను అస్సలు దానం చేయకూడదట. అలాగే.. పాత పుస్తకాలు, వాడిన పెన్ను కూడా దానం చేయకూడదట. ఒకవేళ ఎవరికైనా పుస్తకాలు ఇవ్వాలనుకుంటే.. కొత్తవి కొన్ని గిఫ్ట్ గా ఇవ్వాలట కానీ.. చదివేసిన పుస్తకాలను దానం చేయకూడదట.