Runa Mafi : అర్హులైనప్పటికీ రుణమాఫీ రాలేదా..? అయితే ఇలా చేయండి…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Runa Mafi : అర్హులైనప్పటికీ రుణమాఫీ రాలేదా..? అయితే ఇలా చేయండి…!

 Authored By ramu | The Telugu News | Updated on :20 July 2024,8:00 am

ప్రధానాంశాలు:

  •  Runa Mafi : అర్హులైనప్పటికీ రుణమాఫీ రాలేదా..? అయితే ఇలా చేయండి...!

Runa Mafi : గత ఎన్నికల ప్రచారాలలో భాగంగా అధికారంలోకి వస్తే రుణమాఫీలు చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన మాట ప్రకారం ప్రస్తుతం వ్యవసాయ రుణాల మాఫీ ప్రక్రియను ప్రారంభించింది. ఇక ఇచ్చిన హామీ ప్రకారం దాదాపు రెండు లక్షల వరకు రుణాలు మాఫీ చేయనున్నారు. అయితే రైతులు వివిధ బ్యాంకుల నుండి తీసుకున్న వ్యవసాయ రుణాలను మూడు విడతల్లో ప్రభుత్వం పూర్తి చేయనున్నట్లు ప్రకటించడం జరిగింది. ఇక దీనిలో భాగంగానే మొదటి విడతలో లక్ష రూపాయల వరకు రుణాలు మాఫీ చేయనున్నారు. అయితే ఇటీవల స్వయంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రుణమాఫీని ప్రారంభించి లబ్ధిదారులతో ముచ్చటించటం జరిగింది. దీనిలో భాగంగానే రుణమాఫీకి అర్హులైన దాదాపు 11లక్షల 50 వేల మంది రైతుల ఖాతాల్లో 6 వేల 98 కోట్ల రూపాయలు జమ చేయనున్నట్లు తెలిపారు. ఈ విధంగా ఇప్పటికే లక్ష రూపాయల లోపు రుణాలు తీసుకున్న రైతుల ఖాతాలో డబ్బులు జమ కాగా… వివిధ కారణాల వలన అర్హులైన కొందరికి ఈ రుణమాఫీ అందలేదు. అయితే ఇలాంటి వారి కోసమే ప్రభుత్వం ప్రత్యేకంగా రుణమాఫీ పర్యవేక్షణ మరియు ఫిర్యాదు పరిష్కార ఏర్పాటు కూడా చేయడం జరిగింది.

Runa Mafi రుణమాఫీ రాలేదా….

మీరు వ్యవసాయం చేస్తున్నారా..?పెట్టుబడి కోసం లేదా ఇతర అవసరాల కోసం బ్యాంకు నుండి రుణాలు తీసుకుని ఉన్నారా..?మీరు తీసుకున్న బ్యాంకు లోన్ ప్రభుత్వం సూచించిన రుణమాఫీ నిబంధనల ప్రకారం ఉందా.? అయితే మీరు కచ్చితంగా ప్రభుత్వం అందిస్తున్న రుణమాఫీకి అర్హులే అవుతారు. అయినప్పటికీ కూడా మీకు రుణమాఫీ కాలేదు అంటే ఈ విధంగా చేయండి.రుణమాఫీ పథకానికి సంబంధించి రైతుల మదిలో ఏర్పడుతున్న సందేహాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు ఇటీవల వ్యవసాయ శాఖ ప్రత్యేకంగా విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అర్హులైన రుణమాఫీ జరగని వారు అధికారిక ఐటీ పోర్టల్ ద్వారా మీ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లవచ్చు. అంతేకాక రుణమాఫీకి సంబంధించి ఫిర్యాదుల స్వీకరణ కోసం ప్రత్యేకంగా ఓ పర్యవేక్ష విభాగాన్ని కూడా ఏర్పాటు చేశారు. మండల స్థాయిలో సహాయక కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. కావున రైతులు ఆయా గ్రామ పరిధిలో ఉన్నటువంటి మండల ఫిర్యాదు కేంద్రాలను సందర్శించి మీ సమస్యలను ఫిర్యాదు చేసుకోవచ్చు.

Runa Mafi అర్హులైనప్పటికీ రుణమాఫీ రాలేదా అయితే ఇలా చేయండి

Runa Mafi : అర్హులైనప్పటికీ రుణమాఫీ రాలేదా..? అయితే ఇలా చేయండి…!

ఇలా ఐటి పోర్టల్ లేదా మండల సహాయక కేంద్రాల ద్వారా మీరు ఫిర్యాదు అందించినట్లయితే 30 రోజుల్లోనే మీ సమస్యకు పరిష్కారం అందుతుంది. కాబట్టి అర్హులైన రుణమాఫీ జరగని వారు ఈ రెండు మార్గాలను ఉపయోగించి మీ సమస్యను పరిష్కరించుకోవచ్చు. అలాగే మీరు లోన్ తీసుకున్న బ్యాంకు ను కూడా ఒకసారి సందర్శించి ఏవైనా సాంకేతిక కారణాల వలన రుణమాఫీ డబ్బు జమ కాకుంటే దానిని పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది. ఈ విధంగా రైతులు ఈ సదుపాయాలను ఉపయోగించుకుని రుణమాఫీలను పొందవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ విషయాన్ని ప్రతి రైతుకు తెలిసేలా షేర్ చేయండి.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది