Runa Mafi : గుడ్ న్యూస్.. రెండో విడత 1.5 లక్షల రుణమాఫీపై కీలక అప్‌డేట్ విడుదల చేసిన సీఎం రేవంత్..!
ప్రధానాంశాలు:
Runa Mafi : గుడ్ న్యూస్.. రెండో విడత 1.5 లక్షల రుణమాఫీపై కీలక అప్‌డేట్ విడుదల చేసిన సీఎం రేవంత్..!
CM Revanth Reddy : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతుల రుణ మాఫీ ప్రకటిస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి తొలి విడవగా ఈ నెల 18న మొదటి విడత రుణమాఫీ అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. లక్ష వరకు ఉన్న రైతుల రుణమాఫీ చేస్తూ తెలంగాణా ప్రభుత్వం ప్రకటించింది. మొదటి విడతగా దాదాపు 11 లక్షల మంది రతుల కోసం 6 వేల కోట్లు ఖర్చు పెట్టారు. ఐతే ఇప్పుడు రెండో విడతగా 1.5 లక్షల రుణమాఫీని చేస్తున్నట్టు తెలుస్తుంది.జూలై 31న అసెంబ్లీలో ఈ రెండో విడత రుణమాఫీ ప్రకటిస్తున్నట్టు తెలుస్తుంది. ఈసారి 1.5 లక్షల దాకా రుణమాఫీ చేయబోతున్నారని సమాచారం. ఇక మూడో విడతగా 2 లక్షల వరకు రుణమాఫీ ప్రకటిస్తారని తెలుస్తుంది. రెండో విడత రుణమాఫీ ఈ నెల చివరన ప్రకటిస్తారని తెలిసిన ప్రజలు ఆ ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Runa Mafi ఆగష్టు 15లోగా అందరికీ రుణమాఫీ అమలు..
సీఎం చెప్పినట్టుగా ఆగష్టు 15 లోగా రైతు బందు పూర్తిగా 3 విడతలుగా అందచేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అందులో భాగంగానే ఇప్పటికే మొదటి విడత 1 లక్ష వరకు రుణమాఫీ అదించగా రెండో విడతగా 1.5 లక్షల దాకా రుణమాఫీ ఉంటుందని తెలుస్తుంది. ఇక 3వ విడత 2 లక్షల దాకా రుణ మాఫీ రైతులకు ప్రకటిస్తారని తెలుస్తుంది. ఆగష్టు 2 నుంచి 14 వరకు సీఎం రేవంత్ రెడ్డి విదేశాల్లో పర్యటించనున్నారు. ఐతే 3వ విడత 2 లక్షల రుణమాఫీపై మరోసారి చర్చ జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఐతే 2 లక్షల రుణమాఫీ పై రేవంత్ ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది. తెలంగాణా ప్రభుత్వం రైతు రుణమాఫీ ఒక ప్రెస్టిజియస్ గా తీసుకుంది. ప్రతిపక్షాలకు ఎక్కడ ఛాన్స్ ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ ఇవ్వాలని చూస్తుంది. అయితే ఇప్పటికే మొదటి విడత రుణమాఫీ పొందిన వారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తున్నారు. రెండో విడత కూడా అనుకున్న టైం కు రిలీజ్ చేస్తే ఇప్పటి వరకు ఏమో కానీ రైతుల దృష్టిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మెట్టు ఎక్కినట్టు అవుతుంది.