Runa Mafi : మూడో విడ‌త రుణ‌మాఫీ ప్ర‌క్రియ‌ ..ఇందులో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Runa Mafi : మూడో విడ‌త రుణ‌మాఫీ ప్ర‌క్రియ‌ ..ఇందులో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి..!

Runa Mafi : తెలంగాణ రాష్ట్రంలో రైతుల సంక్షేమంపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద పెట్టడం మ‌నం చూశాం. అయితే ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతు రుణమాఫీ అమలు చేస్తోంది. ఈ మహత్తరమైన కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం జులై 18న ప్రారంభించింది. ఇప్పటికే తొలి విడత రుణమాఫీ అమలు చేశారు.మొదటి విడతలో లక్ష రూపాయలలోపు రైతు రుణాలను మాఫీ చేసిన ప్రభుత్వం తాజాగా లక్షన్నర లోపు రుణాలను మాఫీ చేసింది. ఇలా రెండు విడతల్లో 17 లక్షలకు పైగా […]

 Authored By ramu | The Telugu News | Updated on :31 July 2024,5:00 pm

Runa Mafi : తెలంగాణ రాష్ట్రంలో రైతుల సంక్షేమంపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద పెట్టడం మ‌నం చూశాం. అయితే ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతు రుణమాఫీ అమలు చేస్తోంది. ఈ మహత్తరమైన కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం జులై 18న ప్రారంభించింది. ఇప్పటికే తొలి విడత రుణమాఫీ అమలు చేశారు.మొదటి విడతలో లక్ష రూపాయలలోపు రైతు రుణాలను మాఫీ చేసిన ప్రభుత్వం తాజాగా లక్షన్నర లోపు రుణాలను మాఫీ చేసింది. ఇలా రెండు విడతల్లో 17 లక్షలకు పైగా రైతుల ఖాతాల్లో రూ.12వేల కోట్లకు పైగా నిధులు జమయ్యాయి. ఈ రుణమాఫీ ద్వారా రైతులపై ఆర్థిక భారం తగ్గింది.

Runa Mafi : Runa Mafiఇలా చెక్ చేసుకోండి..

మూడో విడతలో రెండు లక్షల లోపు రుణాలు మాఫీ కానున్నాయి. దీంతో మరింత మంది రైతులు ఆర్థిక కష్టాల నుండి బయటపడతారు. అయితే ఏ రైతులకు రుణమాపీ వర్తిస్తుంది… ఎవరికి వర్తించదో విధివిధానాల్లోనే తెలిపింది ప్రభుత్వం. కానీ అర్హత కలిగిన కొందరు రైతులకు కూడా రుణమాఫీ కాకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు. ఇలా కొందరు సమాచార లోపంతో, మరికొందరు సాంకేతిక కారణాలతో ఆందోళన చెందుతున్నారు. రుణమాఫీ రాలేదని ఆందోళ‌న చెందుతున్న‌ రైతులు ముందుగా మీ పేరు అధికారులు ప్రకటించన లిస్ట్ లో వుందో లేదో చెక్ చేసుకోవాలి. అర్హుల లిస్ట్ లో మీరు పేరు లేకుంటే బ్యాంక్ అధికారులను సంప్రదించాలి.

Runa Mafi

Runa Mafi

తెలంగాణ ప్రభుత్వ రుణమాఫీ వెబ్ సైట్ https://clw.telangana.gov.in/Login.aspx లోని అర్హుల లిస్ట్ లో మీ పేరుందో లేదో చెక్ చేసుకొండి. రుణమాఫీ అర్హుల లిస్ట్ లో మీ పేరున్నా బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు పడకుంటే అప్పుడు మీరు ఎక్క‌డ‌ రుణం తీసుకున్నారో ఆ బ్యాంకుకు వెళ్లాల్సి వుంటుంది. బ్యాంకు అధికారులను రుణమాఫీ గురించి అడిగితే సమస్య ఏమిటో చెబుతారు. వెంటనే ఆ సమస్యను పరిష్కరించుకుంటే రుణమాఫీ డబ్బులు అకౌంట్ లో పడతాయి. రుణమాఫీ సమస్యల పరిష్కారానికి ప్రతి మండలకేంద్రంలో ఓ సహాయ కేంద్రాన్ని ఏర్పాటుచేసారు. రుణమాఫీ సమస్యల పరిష్కారానికి ఐటీ పోర్టల్, సహాక కేంద్రాల ద్వారా వచ్చే ఫిర్యాదులను 30 రోజుల్లోపు పరిష్కరించాలని అధికారులకు ప్ర‌భుత్వం ఆదేశాలు కూడా జారీ చేసింది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది