WhatsApp : వాట్సాప్‌లో రెడ్ హార్డ్ ఎమోజీ పంపిస్తే శిక్షలు కఠినంగా లేవుగా… రూ. 20లక్షల జరియానా, ఐదేళ్ల జైలు శిక్ష
WhatsApp : ప్రతి ఒక్కరికి వాట్సాప్ నిత్యం అందుబాటులో ఉంటుంది. లక్షల మంది నిత్యం వాట్సాప్ ద్వారా చాట్ చేస్తూ పలు ఎమ్మోజీలు కూడా పంపిస్తుంటారు. అయితూ ప్రపంచంలో దాదాపు అన్ని దేశాల్లో అందుబాటులో ఉన్న ఈ మెసేజింగ్ యాప్స్‌పై పలు దేశాలు రకరకాల నిబంధనలు విధిస్తున్నాయి. కొన్ని దేశాలు తమ కంట్రీకి చెందిన యూజర్ల వాట్సాప్ హిస్టరీని తమ దేశంలోని సర్వర్లలోనే స్టోర్ చేయాలని కోరితే, మరికొన్ని యూజర్ల డేటాకు భద్రత కల్పించాలంటూ నిబంధనలు విధిస్తున్నాయి. గల్ఫ్ న్యూస్ వెల్లడించిన వివరాల ప్రకారం… వాట్సాప్ చాట్స్‌లో ‘రెడ్ హార్ట్’ ఎమోజీలు పంపించడం వేధింపులతో సమానమైన నేరంగా పరిగణించబడుతుందని
యాంటీ ఫ్రాడ్ అసోసియేషన్ సభ్యుడు అల్ మోతాజ్ కుత్బీ తెలిపారు.వాట్సాప్‌లో కొన్ని రకాల ఇమేజెస్, ఎక్స్‌ప్రెషన్స్‌ను పంపించడం వేధింపుల నేరమవుతుందని పేర్కొన్నారు. ఎదుటివారు కేసు నమోదు చేస్తే చిక్కుల్లో పడక తప్పదని హెచ్చరించారు. కాబట్టి వాట్సాప్ యూజర్స్.. ఎదుటివాళ్ల అంగీకారం లేనిదే వారితో చాట్ చేయొద్దన్నారు. వారిని ఇబ్బందిపెట్టే రీతిలో చాట్‌లో సంభాషణలు జరపవద్దన్నారు. ముఖ్యంగా రెడ్ హార్ట్ ఎమోజీల విషయంలో జాగ్రత్తపడాలన్నారు. వాట్సాప్‌లో ‘రెడ్ హార్ట్’ ఎమోజీని ఎదుటి వ్యక్తి అనుమతి లేకుండా పంపిస్తే వేధింపులతో సమానమైన నేరంగా ప్రకటించింది.ఈ విషయాన్ని ఆ దేశానికి చెందిన యాంటీ ఫ్రాడ్ అసోసియేషన్ సభ్యుడు అల్ మోతాజ్ కుత్బీ తెలిపారు.
WhatsApp : శిక్షలు మాములుగా లేవుగా..!
ఇలా రెడ్ హార్ట్ ఎమోజీని పంపించిన వారికి 1 లక్ష సౌదీ రియల్స్.. మన కరెన్సీలో చెప్పాలంటే రూ. 20 లక్షల జరిమానాగా విధిస్తారు. ఒకవేళ ఇదే నేరంలో ఒకటి కంటే ఎక్కువ సార్లు దోషిగా తేలితే ఏకంగా రూ. 60 లక్షల రూపయాలతో (3 లక్షల రియల్స్) పాటు ఐదేళ్ల వరకు జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉందని తెలిపారు.వాస్తవానికి సౌదీ అరేబియాలో తెలియని వాళ్లతో చాట్ చేయడానికి ప్రయత్నించడం కూడా నేరం కిందకు వస్తుంది. ఇప్పటికే కఠిన చట్టాలను అమలు చేస్తున్న సౌదీ అరేబియాలో…తాజా చట్టంతో సోషల్ మీడియా వాడకాన్ని మరింత సేఫ్ గా మార్చాలని ప్రయత్నిస్తోంది.