Whatsapp : ఐఫోన్ వాడే వాళ్లకు వాట్సాప్ గుడ్ న్యూస్, మూడు కొత్త ఫీచర్లు ఇవే…!
Whatsapp : ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త మార్పులతో వినియోగదారులకు అందుబాటులోకి వస్తుంది. ఇక ఇప్పుడు ఐఫోన్ యూజర్లకు మూడు కీలక మార్పులతో అందుబాటులోకి వచ్చింది వాట్సాప్.వాయిస్ మెసేజ్ లను రికార్డ్ చేసిన తర్వాత పాస్ చేసి విని మళ్ళీ సెండ్ చేసే అవకాశం ఉంది. గతంలో అయితే రికార్డ్ చేసిన తర్వాత వినే అవకాశం లేకుండా సెండ్ చేసే వాళ్ళు.
కొన్ని రోజుల క్రితం వరకు ఇది బీటా మోడ్ లో ఉండేది. కాని ఇప్పుడు పబ్లిక్ లో అందుబాటులోకి వచ్చేసింది. వినే టైం లో నచ్చితే సెండ్ చేయవచ్చు లేదా క్యాన్సిల్ చేయవచ్చు.మరో ఫీచర్ విషయానికి వస్తే ఫోకస్ మోడ్ అనే డునాట్ డిస్టర్బ్ ఫీచర్ ఇప్పుడు వాట్సాప్ కు కూడా అందుబాటులోకి వచ్చింది. గతంలో ఐమెసేజ్ లాంటి వాటికి మాత్రమే అందుబాటులో ఉండేది ఈ ఫీచర్.
దీనితో వాట్సాప్ నుంచి కూడా మనకు డునాట్ డిస్టర్బ్ లో మెసేజెస్ వస్తాయి.ఇక మరో ఫీచర్ విషయానికి వస్తే నోటిఫికేషన్ లో మెసేజ్ చేసిన వారి ప్రొఫైల్ పిక్ కనపడేది కాదు. కాని ఇప్పుడు దాన్ని మెరుగు పరిచి నోటిఫికేషన్ లో ప్రొఫైల్ పిక్ కూడా ఉండేలా మార్పులు చేసారు.