Labour Insurance Card : తెల్ల రేషన్ కార్డుదారులు లేబర్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Labour Insurance Card : తెల్ల రేషన్ కార్డుదారులు లేబర్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు..!

Labour Insurance Card : మీకు తెల్ల రేషన్ కార్డు ఉందా..? అయితే మీరు లేబర్ ఇన్సూరెన్స్ కార్డు కూడా పొందవచ్చు. ఏడాదికి రూ.22 చొప్పున ఐదేళ్లకు కలిపి చెల్లించాల్సింది కేవలం రూ. 100 మాత్రమే. ఈ కార్డు ఉంటే అనేక ప్రయోజనాలు పొందవచ్చు. Labour Insurance Card డాక్యుమెంటేషన్ లేబర్ ఇన్సూరెన్స్ కార్డ్ కోసం దరఖాస్తు చేయడానికి కింది పత్రాలను సమర్పించాలి – లేబర్ ఇన్సూరెన్స్ కార్డుకు దరఖాస్తు చేసుకునేందుకు 18 నుంచి 55 ఏళ్ల […]

 Authored By ramu | The Telugu News | Updated on :23 September 2024,5:00 pm

ప్రధానాంశాలు:

  •  Labour Insurance Card : తెల్ల రేషన్ కార్డుదారులు లేబర్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు

Labour Insurance Card : మీకు తెల్ల రేషన్ కార్డు ఉందా..? అయితే మీరు లేబర్ ఇన్సూరెన్స్ కార్డు కూడా పొందవచ్చు. ఏడాదికి రూ.22 చొప్పున ఐదేళ్లకు కలిపి చెల్లించాల్సింది కేవలం రూ. 100 మాత్రమే. ఈ కార్డు ఉంటే అనేక ప్రయోజనాలు పొందవచ్చు.

Labour Insurance Card డాక్యుమెంటేషన్

లేబర్ ఇన్సూరెన్స్ కార్డ్ కోసం దరఖాస్తు చేయడానికి కింది పత్రాలను సమర్పించాలి
– లేబర్ ఇన్సూరెన్స్ కార్డుకు దరఖాస్తు చేసుకునేందుకు 18 నుంచి 55 ఏళ్ల వయసు ఉన్న స్త్రీ. పురుషులు అర్హులు.
– ప్రభుత్వ ఉద్యోగులు తప్ప ఎలాంటి కూలీలైన, ఇతరులైన ఇందులో చేరవచ్చు.
– రేషన్ కార్డు (తెల్ల కార్డు)
– ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీలు
– బీమా ప్రీమియం చెల్లింపును చూపించే బ్యాంక్ చలాన్, దానిని తప్పనిసరిగా కార్మిక కార్యాలయానికి సమర్పించాలి .

Labour Insurance Card ప్రీమియం చెల్లింపు

– ఈ బీమా పథకం మొత్తం ప్రీమియం రూ. 110, ఐదేళ్ల పాటు అడ్వాన్స్‌గా చెల్లించాలి. ఇది రూ. సంవత్సరానికి 22 , అందించిన ప్రయోజనాలతో పోలిస్తే ఇది కనిష్ట ధర.
– ఒక్కసారి చెల్లింపు రూ. 110 ఐదేళ్లపాటు కవరేజీని నిర్ధారిస్తుంది, వార్షిక చెల్లింపులు చేయాల్సిన అవసరం నుండి లబ్ధిదారులకు ఉపశమనం ల‌భిస్తుంది.

ప్రయోజనాలు :   పాలసీదారు సహజ మరణం పొందితే రూ. 1,30,000 అందుతాయి. అలాగే ప్రమాదవశాత్తూ మరణం జరిగే రూ. 6,00000 ఇన్సూరెన్స్ అందుతుంది.
– ఒక ఇంట్లో ఇద్దరు అడపిల్లలు వుంటే ఒకొక్కరికి వివాహ నజరానాగా 30,000 అందుకుంటారు.
– ప్రసవ కానుకగా రెండు ప్రసవాలకు రూ. 30,000 చొప్పున వచ్చే అవకాశం ఉంది.

Labour Insurance Card తెల్ల రేషన్ కార్డుదారులు లేబర్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు

Labour Insurance Card : తెల్ల రేషన్ కార్డుదారులు లేబర్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు

– ఒక సంవత్సరం పాలసీ పొందిన తరువాత లబ్దిదారునికి ప్రమాదం జరిగి 50 శాతం దివ్యాంగుడిగా ఉంటే 2.50 లక్షలు అందుతాయి. అదే 100% ఉంటే 5 లక్షల పరిహారం పొందే అవకాశం ఉంది.
– ఈ లేబర్ ఇన్సూరెన్స్ ఒకేసారి 110/- రూ. చెల్లిస్తే 5 సంవత్సరాలు వరకు చెల్లించనక్కర్లేదు. అంటే మీరు చెల్లించేది సంవత్సరానికి 22/- రూ మాత్రమే.
– ఈ కార్డు తీసుకోవాలనుకునే వారు మీ మండలంలోని కార్మిక అధికారిని (లేబర్ ఆఫీసర్) లేదా ఎంపీడీఓ,,తహసీల్దార్ ను సంప్రదించవచ్చు.
– ఈ పథకంలో చాలా మంది కార్మికులు మాత్రమే చేరవచ్చని అనుకుంటారు. అది కానే కాదు. తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి కుటుంబం ఈ పథకానికి అర్హులు అవుతారు.

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది