Own Property : సొంత ఆస్తి అంటే ఇల్లు భూమి ఉన్న వారు ఇవి తప్పకుండా తెలుసుకోవాలి..!
ప్రధానాంశాలు:
Own Property : సొంత ఆస్తి అంటే ఇల్లు భూమి ఉన్న వారు ఇవి తప్పకుండా తెలుసుకోవాలి..!
Own Property : భూమి విషయంలో ఈమధ్య చాలా మంది మోసాలు చేస్తూ డబ్బులు కాజేస్తున్నారు. సరైన అవగాహన లేకపోవడం వల్ల ఇలా జరుగుతుంది. తప్పుడు ఆస్తి పత్రాలు చూపించి అమాయకుల దగ్గర డబ్బు జాకేస్తున్నారు. ఆ తర్వాత వారిని బ్లాక్ మెయిల్ చేసి బెదిరించిన సందర్భాలు ఉన్నాయి. ఈరోజుల్లో భూమికి ఉన్న డిమాండ్ అందరికీ తెలిసిందే. భూమి లేదా ఇల్లు ఇలా స్థిరాస్తి ఏదైనా సరే దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. భూమి మీద పెట్టుబడి ఎప్పటికీ సురక్షితమే కానీ అది తప్పుదారి పట్టకుండా చూసుకోవాలి. భూమి కొనుగోలు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే భూమి విషయంలో చాలా మోసం జరుగుతుందని తెలిసిందే. తప్పుడ్ ఆస్తుల పత్రాలు చూపించి అమాయకుల దగ్గర లక్షలు నొక్కేస్తున్నారు కొందరు వ్యక్తులు. ఐతే ఇలాంటివి జరగకుండా ఉండాలనే ప్రభుత్వం ఆలోచిస్తుంది.
Own Property ఆస్తి పత్రాలు డిజిలైట్ చేస్తే..
ప్రజలకు వచ్చిన ఈ ఇబ్బందిని గుర్తించిన ప్రభుత్వం దీనికి సంబందించిన చర్యలు చేపడుతుంది. భూమి విషయంలో తలెత్తే సమస్యలను నివారించాలనే ఉద్దేశంతో ప్రభువం అన్ని ఆస్తి పత్రాలను డిజిటలైజ్ చేయాలని ఫిక్స్ అయ్యింది. ఈ డిజిటలైజ్ ద్వారా ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది.భూమి యజమాని తన ఆస్తి ని డిజిటలైజ్ చేయడం ద్వారా ఎలాంటి మోసం జరిగే ఛాన్స్ లేదు. రెవెన్యూ శాఖ ఇప్పటికే ఈ రకం మోసాలను అడ్డుకట్ట వేయాలని చూస్తుంది. ఐతే ఈ డిజిటలైట్ కోసం స్పేస్ డాక్యుమెంట్స్ పోర్టల్ లో అప్లోడ్ చేయాలి.
ఇలా చేస్తే భూమి పత్రాల కోసం ప్రజలు రెవెన్యూ కార్యాలయానికి తిరగాల్సిన అవసరం లేదు. వచ్చే జనవరి నుంచి ఈ డిజిటలైజేషన్ ప్రక్రియ మొదలవుతుందని తెలుస్తుంది. భూమి సంబంధించిన పత్రాలతో పాటు ఆధార్ కార్డ్ కూడా అనుసంధానం చేస్తే ఎలాంటి మోసం జరగకుండా ఉంటుంది. భూమి రికార్డులను డిజిటలైజేషన్ చేసుకుంటే అన్ని రికార్డులు పొందడం సులవవుతుంది. దీని వల్ల నకిలీ డాక్యుమెంట్లు, ఫోర్జరీ, అమ్మకాలు తగ్గే ఛాన్స్ ఉంటుంది.