Vizag Public Talk : రాసిపెట్టుకోండి.. నెక్స్ట్ సీఎం ఆయనే అంటున్న వైజాగ్ ప్రజలు.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Vizag Public Talk : రాసిపెట్టుకోండి.. నెక్స్ట్ సీఎం ఆయనే అంటున్న వైజాగ్ ప్రజలు..

 Authored By kranthi | The Telugu News | Updated on :4 March 2023,11:40 am

Vizag Public Talk : ఏపీకి కాబోయే సీఎం ఎవరు. అంటే.. 2024 ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? ఎవరు ముఖ్యమంత్రి పఠం అధిరోహిస్తారు అనేదానిపై ఇంకా క్లారిటీ లేదు. వచ్చే సంవత్సరమే ఎన్నికలు. అధికార వైసీపీ, టీడీపీ, జనసేన.. ఈ మూడు పార్టీలే ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్నాయి. మరోసారి గెలిచి వైఎస్ జగన్ రికార్డు క్రియేట్ చేస్తారా? లేక.. చంద్రబాబుకి ఏపీ ప్రజలు మరోసారి అవకాశం ఇస్తారా? లేదా పవన్ కు ఒక చాన్స్ ఇస్తారా? దీనిపై వైజాగ్ ప్రజలు ఏమంటున్నారు తెలుసుకుందాం పదండి. సంక్షేమ పథకాలు అమలు చేసినంత మాత్రాన..

who is next cm in andhra pradesh vizag public opinion

who is next cm in andhra pradesh vizag public opinion

వాటిని చూసి జనాలు ఓటేస్తారని అనుకోవడం అవివేకం… అంటూ వైజాగ్ ప్రజలు సీఎం జగన్ గురించి చెప్పుకొచ్చారు. ఇలా.. ఉచిత పథకాలు ఇచ్చి ప్రజలను సోమరులను చేస్తున్నారు. పథకాలను ప్రవేశపెట్టి ఎన్నికల్లో గెలవాలని అనుకోవడం భ్రమ అన్నారు. ఈసారి పవన్ కళ్యాణ్ కి చాన్స్ ఇస్తే బెటర్ అని కొందరు చెబుతున్నారు. మరికొందరు అయితే.. కొత్త వాళ్లకు చాన్స్ ఇద్దాం అంటున్నారు. కొత్త వాళ్లు అంటే ఎవరు.. అయితే జనసేన, లేదంటే బీజేపీ. కానీ.. ఇప్పటికే గెలిచి రాష్ట్రాన్ని పాలించిన వాళ్లకు అయితే మరోసారి చాన్స్ ఇచ్చేదే లేదని అంటున్నారు.

Vizag North Public Talk about YS Jagan | AP Public Talk 2024 Election | Who  is AP Next CM 2024 - YouTube

Vizag Public Talk : జగన్ వద్దు.. టీడీపీ వద్దు

కొత్త వాళ్లు అంటే పవన్ కళ్యాణ్ కు ఈసారి ఒక చాన్స్ ఇవ్వాలని జనాలు అనుకుంటున్నారా? కొత్త వాళ్లు రావాలని ఒకరిద్దరు అనుకుంటే సరిపోదు. ప్రస్తుతానికి జగనే మళ్లీ సీఎం అంటూ మరికొందరు వైజాగ్ ప్రజలు అభిప్రాయపడ్డారు. ఇలా.. ఎవరి అభిప్రాయాలను వాళ్లు చెప్పుకొచ్చారు. కానీ.. ఇక్కడ ఎక్కువ మంది ఓటేసింది మాత్రం జగన్ కు లేదంటే.. కొత్త వాళ్లకు చాన్స్ అన్నారు కానీ.. టీడీపీ గురించి మాట్లాడిన వాళ్లు అయితే లేరు. దీన్ని బట్టి వచ్చే ఎన్నికల్లో ఎవరు సీఎం అవుతారో స్పష్టంగా అర్థం అవుతోంది కదా.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది