Tsrtc Free Bus : ఉచిత బస్సు ప్రయాణం ఎవరికి నష్టం .. ప్రభుత్వానికా..? మనకా..?
Tsrtc Free Bus : తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అందించింది. కానీ ఈ ఫ్రీ బస్సు సదుపాయం అన్ని బస్సుల్లో అందుబాటులో లేదు. కేవలం ఆర్డినరీ ఎక్స్ప్రెస్ బస్సులో మాత్రమే ఉంది. లగ్జరీ, సూపర్ లగ్జరీ, గరుడ లాంటి బస్సుల్లో ఈ సౌకర్యం లేదు. ఈ సౌకర్యం కేవలం తెలంగాణలో నివసించే వారికి మాత్రమే. అయితే ఈ ఫ్రీ బస్ ప్రయాణ మీద చాలామందికి అపోహలు ఉన్నాయి. అయితే రాష్ట్రంలో మహిళల్లో ఈ ఉచిత బస్సు ప్రయాణం పై మంచి రెస్పాన్స్ వస్తుంది. పథకం ప్రారంభించినప్పటి నుంచి బస్టాండ్ లో, బస్సు ల్లో మహిళలు ఎక్కువగా కనిపిస్తున్నారు. అయితే కొంతమంది ఈ పథకాన్ని వ్యతిరేకిస్తున్నారు. దీని వలన నష్టాలు ఉన్నాయని అంటున్నారు.ప్రస్తుతం టిఎస్ఆర్టీసీ పెరిగిన పెట్రోల్, బస్సుల మెయింటెనెన్స్, బస్టాండ్ లో మెయింటెనెన్స్, డ్రైవర్, కండక్టర్ల జీతాలు వీటితోపాటు బస్సు డిపోలో పనిచేసే మెకానిక్ మెయింటెనెన్స్ కార్మికుల జీతాలు వీటన్నింటిని ఖర్చులు కలిపి ప్రతిరోజు ఆర్టీసీకి కావలసిన దానికంటే దాదాపుగా మూడు కోట్లు రూపాయలు తక్కువగా ఆదాయం వస్తుంది.
అంతేకాదు ప్రైవేట్ ట్రావెల్స్, రైల్వేస్ నుంచి ఆర్టీసీకి పోటీ ఉంది. వీటన్నింటినీ ఆర్టీసీ కష్టాలు తగ్గించుకోవడానికి ఇతర మార్గాలలో ప్రయత్నాలను మొదలుపెట్టింది. అందులో భాగంగా ఆర్టిసి కార్గో పార్సెల్ కూడా నడుపుతుంది. కానీ ఆర్టీసీలకు కార్గో సర్వీసుల నుంచి అనుకున్నంతగా స్పందన రావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కల్పించడం వలన దాదాపుగా 50 శాతం ఆదాయం కోల్పోవాల్సి వస్తుంది.అయితే ప్రస్తుతం టిఎస్ఆర్టీసీ కి ప్రతిరోజు 14 కోట్ల ఆదాయం వస్తుందని ఆర్టీసీ ఎండి సజ్జనార్ తెలిపారు. వీటిలో సగం ఏడు కోట్ల రూపాయలను వదులుకోవాల్సి వస్తుంది. అయితే ఈ స్కీమ్ లో మొత్తం భారాన్ని ఆర్టీసీ మీద వేయలేదు. ప్రతి నెల ఆర్టీసీ ఎంత డబ్బును కోల్పోతుందో లెక్కలు రాసి ప్రభుత్వానికి తెలుపుతుంది. మహిళలు ఎంత డబ్బును కట్టాలో దానిని ప్రభుత్వం కడుతుంది. ప్రతిరోజు ఏడు కోట్లు ఆర్టీసీకి చెల్లించినా, ప్రతినెల రెండు కోట్లు ప్రభుత్వానికి చెల్లించాలి. దీని ప్రకారం సంవత్సరానికి 2520 కోట్లు ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించాలి. అయితే ప్రతి మహిళ ప్రయాణించిన డబ్బు ప్రభుత్వం ఆర్టీసీకి వస్తుందనడంతో కచ్చితంగా ఆర్టీసీకి ఆదాయం పెరుగుతుంది.
ఉచిత బస్సు ప్రయాణం అంటే మహిళలు ఉద్యోగం చేయడానికి ముందుకు వస్తారు. దీని వలన ఆర్థిక వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది. సొంత వాహనాలు వాడే మహిళలు ఆర్టీసీ బస్సులను ఎక్కుతారు. దీనివలన పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గుతుంది. కాలుష్యం కూడా తగ్గుతుంది. ఉచిత బస్ ప్రయాణాల వలన దేవాలయాలు, పర్యాటక సందర్శికులు పెరిగి ఆదాయం కూడా పెరుగుతుంది. దేవాలయాలు పర్యాటక ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. ఉచిత బస్సు ప్రయాణం వలన బస్టాండ్లో రద్దీ పెరిగి వ్యాపారం చేసుకునే వాళ్ళు పెరుగుతారు. ఆర్టీసీ లో ఉద్యోగ అవకాశాలు కూడా ఏర్పడతాయి అయితే ఈ ఫ్రీ బస్సు వలన ఆటోలు ట్యాక్సీలు నడుచుకొనే వాళ్లు నష్టపోతారు. ముఖ్యంగా ఆటో డ్రైవర్లు టాక్సీ డ్రైవర్లు ప్రస్తుతం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు .
3 Jobs AI : కృత్రిమ మేధస్సు (AI) విస్తృతంగా ప్రవేశించడంతో భారతీయ ఉద్యోగ రంగంలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.…
Kingdom : యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘కింగ్‌డమ్’ జూలై 31న భారీ…
Linguda Vegetable : ప్రకృతి ఇచ్చే ప్రతి ఒక్క కూరగాయ అయినా పనులైన ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. అందులో ఆకుపచ్చని…
Supreme Court : తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టు నేడు కీలక తీర్పును వెలువరించింది. ఈ…
Andhra Pradesh : ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజం గూగుల్ ఆంధ్రప్రదేశ్‌లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు రాయిటర్స్…
Smart Watch : సాధారణంగా చాలామంది చేతిని అందంగా కనిపించేందుకు స్మార్ట్ వాచ్ ని స్టైల్ కోసం, ఇంకా అవసరాల…
Vastu Tips : చాలామందికి తెలియకుండానే కొన్ని తప్పుల్ని ఇంట్లో చేస్తూ ఉంటారు. అలాగే వాస్తు విషయంలో కూడా అలాగే…
kingdom Movie Review : విజయ్ దేవరకొండ Vijay Devarakonda , Bhagya Sri Borse , హీరోగా నటించిన…
This website uses cookies.