Guntur Seats : గుంటూరు జిల్లాలో ఎవరికి ఎన్ని సీట్లు? క్లియర్ గ్రౌండ్ రిపోర్ట్.. నియోజకవర్గాల వారీగా అంచనా.. వీడియో
Guntur Seats : ఏపీలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. 175 నియోజకవర్గాల్లో 175 గెలవాలని వైసీపీ ప్రయత్నిస్తోంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్న 17 నియోజకవర్గాల్లో కూడా గెలవాలని వైసీపీ ప్రయత్నిస్తోంది. నియోజకవర్గాల వారీగా చూసుకుంటే తాడికొండ నుంచి వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఉన్నారు కానీ.. ఆమె వైసీపీ నుంచి సస్పెండ్ అయ్యారు. టీడీపీ నుంచి శ్రవణ్ కుమార్ ఉన్నారు. ఈ నియోజకవర్గంలోనే 40 గ్రామాల పరిధిలో రాజధాని ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. 40 గ్రామాలు ఏకపక్షంగా ఉంటాయి. మిగితా గ్రామాల్లో కూడా అటూ ఇటూగానే ఉండటంతో ఈ సీటు టీడీపీకే వచ్చే అవకాశం ఉంది. మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యేగా ఆళ్ల నాని ఉన్నారు. టీడీపీ నుంచి మళ్లీ నారా లోకేశ్
పోటీ చేస్తారు. ఇక్కడ కూడా రాజధాని ప్రభావం ఉంది. ఆయన టీమ్ కూడా ఇక్కడ యాక్టివ్ గా పని చేస్తోంది. ఈసారి మంగళగిరి సీటు టీడీపీకే వచ్చే చాన్స్ ఉంది. ఇక రేపల్లె సీటు విషయంలో టీడీపీ నుంచి సత్యప్రసాద్, వైసీపీ నుంచి మోపిదేవి పోటీ చేసే అవకాశం ఉంది. ఈ నియోజకవర్గం కూడా టీడీపీకే ఫేవర్ గా ఉంటుంది. తెనాలి చూసుకుంటే మూడు పార్టీలు బలంగా ఉన్నాయి. జనసేన నుంచి నాదెండ్ల మనోహర్ కూడా ఉండటంతో.. ఈ నియోజకవర్గంపై ఇప్పుడే క్లారిటీ రావడం లేదు. ఇక బాపట్ల తీసుకుంటే కోన రఘుపతి ఎమ్మెల్యే ఉన్నారు. ఈ నియోజకవర్గం వైసీపీకి ఫేవర్ గా ఉంది. ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఎక్కువగా ఎస్సీ, ముస్లిం, రెడ్డి సామాజికవర్గం ఎక్కువగా ఉండటం వల్ల కొంచెం ఎమ్మెల్యే మీద అసంతృప్తి ఉంది. క్యాండిడేట్ ను మార్చితే వైసీపీ, టీడీపీ మధ్య హోరాహోరీ జరిగే అవకాశం ఉంది.
Guntur Seats : తెనాలిలో మూడు పార్టీలు బలంగా ఉన్నాయి
ఒకవేళ క్యాండిడేట్ ను మార్చకపోతే టీడీపీకేక ఫేవర్ గా ఉంది. ఇక.. ప్రత్తిపాడు నియోజకవర్గం చూసుకుంటే టీడీపీ నుంచి ఎవరు పోటీ చేస్తారో కన్ఫమ్ అవలేదు. వైసీపీ నుంచి మేకపాటి సుచరిత ఉన్నారు. గుంటూరు వెస్ట్ నుంచి మద్దాల గిరి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇది కూడా టీడీపీకి కంచుకోట. గుంటూరు ఈస్ట్ లో వైసీపీ నియోజకవర్గం. టీడీపీ నుంచి ఎవరు పోటీ చేసినా ఎదురెళ్లాలి. ఇక్కడ వైసీపీకే ఫేవర్ గా ఉంది. నర్సరావుపేట చూసుకుంటే ఇక్కడ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక్కడ వైసీపీకే బలంగా ఉంది. టీడీపీకి క్యాడర్ ఉన్నప్పటికీ నాయకత్వలేమి ఉంది. సత్తెనపల్లి చూస్తే టీడీపీ నుంచి కన్నా పోటీ చేసే అవకాశం ఉంది. వైసీపీ నుంచి అంబటి చేస్తే, టీడీపీ నుంచి కన్నా చేస్తే కన్నా లక్ష్మీనారాయణకే ఫేవర్ గా ఉండనుంది.