YSRCP : ఆ జిల్లా మొత్తం వైసీపీ జండా గ్యారెంటీ.. బయటకొచ్చిన సంచలన సర్వే ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

YSRCP : ఆ జిల్లా మొత్తం వైసీపీ జండా గ్యారెంటీ.. బయటకొచ్చిన సంచలన సర్వే !

 Authored By kranthi | The Telugu News | Updated on :2 April 2023,9:00 pm

YSRCP : ఏపీలో ఎన్నికలకు ఇంకా సంవత్సరం సమయం ఉంది. కానీ.. ఇప్పటి నుంచే ఎన్నికలకు వైసీపీ నేతలు సమాయత్తమవుతున్నారు. వైనాట్ 175 అనే నినాదంతో ముందుకెళ్తున్నారు. వైసీపీ పార్టీలో అన్ని జిల్లాల్లో బలోపేతం చేస్తున్నారు. నిజానికి పుట్టపర్తి నియోజకవర్గంలో ఇదివరకు ఉన్న ఏ ఎమ్మెల్యేలు కూడా చేయని అభివృద్ధిని గత నాలుగేళ్లలోనే వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చాక జరిగింది. వైసీపీ పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి పుట్టపర్తిని అన్ని విధాలా అభివృద్ధి చేశారు. తాజాగా టీడీపీ యువనేత నారా లోకేశ్.. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిపై చేసిన ఆరోపణలను ఆయన తిప్పికొట్టారు.

who will win in 2024 elections in puttaparthi district

who will win in 2024 elections in puttaparthi district

ఆధారాలు లేని ఆరోపణలు నారా లోకేశ్ చేస్తున్నారు. ఇది అతడి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం. లోకేశ్ కు కానీ.. పల్లె రఘునాథరెడ్డికి దమ్ముంటే నిరూపించాలి. వైసీపీ అధికారంలోకి వచ్చాకనే పుట్టపర్తి నియోజకవర్గం అన్ని విధాలా అభివృద్ధి చెందింది. పుట్టపర్తినే శ్రీసత్యసాయి జిల్లాగా ఏర్పాటు చేయించాం. ఇక్కడ శాశ్వత అభివృద్ధికి బాటలు వేస్తున్నాం.. అని ఎమ్మెల్యే అన్నారు. సీఎం జగన్ నాయకత్వంలో గత నాలుగేళ్లుగా తాము కుల, మత రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ప్రజలనే అడిగితే చెబుతారు.. వైసీపీ పాలన ఎలా ఉందో. ఏపీ అభివృద్ధిలో ఎలా దూసుకుపోతోందో.

Finally, Puttaparthi wins battle over Penukonda

YSRCP : వైఎస్ జగన్ ఆధ్వర్యంలో సంక్షేమ పథకాలు అందిస్తున్నాం

ప్రజాసంకల్ప యాత్రలో నల్లమాడ సభలో సీఎం జగన్ ఇచ్చిన మాట మేరకు.. ఈ ప్రాంతంలో కరువు లేకుండా చేస్తా అన్నారు. శాశ్వతంగా ఇక్కడ కరువును పారదోలారు. ఈ ప్రాంతంలో ఉన్న సుమారు 200 చెరువులను హంద్రీనీవా ద్వారా నింపేందుకు అనుమతులు తీసుకొచ్చారు. దాని కోసం సుమారు రూ.864 కోట్లను ప్రభుత్వం ఖర్చు పెడుతోంది. ఇలాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ చేపడుతున్నాం. ఇవేమీ తెలియక.. టీడీపీ నేతలు నోటికొచ్చినట్టు ఏదో ఒకటి వాగుతున్నారు అంటూ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మండిపడ్డారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది