Vakeel Saab : వకీల్ సాబ్ ను సీఎం జగన్ అందుకే టార్గెట్ చేశారా?
Vakeel Saab : వకీల్ సాబ్ సినిమా ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ట్రెండింగ్ లో ఉంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అయితే ఎక్కడ చూసినా సినిమా గురించే చర్చ. అయితే.. సినిమా రిలీజ్ రోజున ఏపీలో చాలా పెద్ద రచ్చే జరిగింది. సినిమా బెనిఫిట్ షోలను ఏపీ ప్రభుత్వం రద్దు చేయడం, సినిమా టికెట్ల ధరలను కూడా పెంచకుండా ఆపడం… ఇవన్నీ చూస్తుంటే కావాలని ఏపీ ప్రభుత్వం వకీల్ సాబ్ సినిమాను అడ్డం పెట్టుకొని పవన్ కళ్యాణ్ మీద ఉన్న పగను తీర్చుకుందని అంతా అనుకున్నారు. పవన్ మీద కక్షతో… ఏపీ ప్రభుత్వం ఇలా సినిమాకు ఇబ్బందులకు గురి చేసిందని అంతా అనుకున్నారు కానీ…. అక్కడ అసలు కథ అది కాదట. అసలు… వకీల్ సాబ్ సినిమాను ఏపీ ప్రభుత్వం కానీ… సీఎం జగన్ కానీ టార్గెట్ చేయడం వెనుక ఉన్న అసలు కథ వేరేనట.
వకీల్ సాబ్ సినిమాపై సీఎం జగన్ ఫోకస్ పెట్టడం వెనుక ఉన్న ప్రధాన కారణాల్లో ఒకటి… పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ను రెచ్చగొట్టడం అట. బెనిఫిట్ షోలను రద్దు చేస్తే… సినిమా టికెట్ల ధరలను పెంచకుండా ఆపితే.. పవన్ ఫ్యాన్స్ రెచ్చిపోతారని.. దాంతో వాళ్లు ఏదో ఒక తప్పు చేస్తారని… ఆ తప్పును పట్టుకొని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గురించి ప్రజలకు చెప్పడం కోసమని అన్నట్టుగా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటేనే చాలా ఎమోషనల్. పవన్ కళ్యాణ్ ను ఒక్క మాట కూడా అననీయరు. అటువంటిది ఆయన సినిమా బెనిఫిట్ షోలను ఆపేస్తే ఊరుకుంటారా? వాళ్లు నిజంగా ఏపీలో రచ్చ రచ్చే చేశారు. ఏపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అయితే… కావాలని వాళ్లపై, జనసేన పార్టీ నేతలపై ఓ ముద్ర వేయడం కోసమే ఈ పని చేశారట.
Vakeel Saab : జనసేనను అడ్డం పెట్టుకొని టీడీపీ ఓట్లకు గండి కొట్టడం కోసం?
ప్రస్తుతం తిరుపతి ఉపఎన్నిక బిజీలో అందరూ ఉన్నారు. తిరుపతి ఉపఎన్నికల్లో ఎలాగైనా వైసీపీ గెలవాలంటే ముందు టీడీపీని ఓడించాలి. ఆ తర్వాత బీజేపీ, జనసేనను ఓడించాలి. అయితే…. టీడీపీ, బీజేపీ-జనసేన పార్టీల మధ్య చిచ్చు పెడితే… ఇక మిగిలిన పార్టీ వైసీపీకే ఓట్లు పడతాయని భావించి… పవన్ ఫ్యాన్స్ ను ఏకం చేయాలని స్కెచ్ వేశారట. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ ఏకం కావాలంటే… పవన్ సినిమా విషయంలో ఏదైనా అడ్డంకులు సృష్టించాలి.. అలా వకీల్ సాబ్ సినిమా విషయంలో అటువంటి నిర్ణయం తీసుకోవడం వల్ల… పవన్ ఫ్యాన్స్ తో పాటు బలిజ సామాజికి వర్గం కూడా ఏకమౌతుంది. తిరుపతిలో ఎక్కువ శాతం ఉన్నది బలిజ సామాజిక వర్గమే. ఈ వర్గం ఇదివరకు టీడీపీకి ఎక్కువగా సపోర్ట్ ఇచ్చేది. తాజాగా ఈ వర్గం జనసేనకు మద్దతు ఇస్తోంది కానీ.. పూర్తిస్థాయిలో కాదు. అందుకే… వీళ్లను ఏకం చేస్తే.. బలిజ వర్గమంతా బీజేపీ, జనసేన అభ్యర్థికి ఓటేస్తారు. దీంతో టీడీపీ ఓట్లు గణనీయంగా తగ్గుతాయి. ఇక్కడ ఓట్లు చీలిపోతాయి కాబట్టి… వైసీపీకి పడే ఓట్లు వైసీపీకి పడుతాయి.. అనే వ్యూహంతో ఇదంతా చేసినట్టు తెలుస్తోంది. మరి… ఇది ఏమాత్రం వర్కవుట్ అవుతుందో తెలియాలంటే తిరుపతి ఉపఎన్నిక పోలింగ్ కోసం వెయిట్ చేయాల్సిందే.