Airplane Windows : ఫ్లైట్ విండోస్ రౌండ్ గా ఎందుకు ఉంటాయో తెలుసా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Airplane Windows : ఫ్లైట్ విండోస్ రౌండ్ గా ఎందుకు ఉంటాయో తెలుసా..?

 Authored By mallesh | The Telugu News | Updated on :29 April 2022,4:37 pm

Airplane Windows: చాలా మంది విమానాల్లో ప్ర‌యాణించాలంటే ఎగిరిగంతేస్తారు. ముందుగానే వెళ్ల‌వ‌ల్సిన ప్రాంతానికి ముందుగానే టికెట్లు బుక్ చేసుకుని ఎదుచూస్తుంటారు. విమానంలో ఎక్కి జాలీగా ప్ర‌యాణిస్తుంటారు. అయితే గాల్లోకి ఎలా ఎగురుతుంది.. ఎలా ప్ర‌యాణిస్తోంది.. అంత బ‌రువు తేలిక‌గా గాలిలోకి ఎలా ఎగురుతోంది. విమానంలో ఏ ఇంధ‌నం పోస్తారు. ఎంత మంది పైల‌ట్స్ ఉంటారు.. ఇలా చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. అయితే విమాన కిటికీలు రౌండ్ గానే ఎందుకు ఉంటాయ‌ని ఎప్పుడైనా అనిపించిందా… ఈ డౌట్ వ‌స్తే మీరు నిజంగా జీనియ‌స్ అని చెప్పాలి.

విమానానికి ఉన్న కిటికీల ఆకారం కూడా ప్ర‌యాణానికి స‌హ‌క‌రిస్తుంది అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం…అయితే ప్ర‌స్తుతం మ‌నం ప్ర‌యాణం చేస్తున్న విమానాల కిటికీలు గుండ్రంగా ఉన్నాయి. కానీ 1950 కి ముందు విమాన కిటికీలు చ‌తుర‌స్రాకారంలో ఉండేవంట‌. వాటి స్పీడ్ కూడా త‌క్కువ‌గానే ఉండేది. అలాగే త‌క్కువ స్పీడ్ తో గాల్లోకి ఎగిరేవి. అయితే చ‌తుర‌స్రాకారంలో ఉండే కిటికీల వ‌ల్ల విమాన స్పీడ్ పై ప్ర‌భావం చూపేద‌ట‌.. అంతే కాకుండా భ‌ద్ర‌త విష‌యంలో కూడా ప్ర‌భావం చూపేద‌ని చెబుతున్నారు. విమాన స్పీడ్, ప్ర‌మాదాల‌పై కూడా ప్ర‌భావం చూపేవ‌ట..

why are airplane windows round the reason behind

why are airplane windows round the reason behind

అందుకే విమానాల కిటికీలు గుండ్రంగా ఉండేలా రిజైన్ చేశారు.గాలిలో ప్ర‌యాణించే విమానం లోప‌ల బ‌య‌ట గాలి ఒత్తిడి ఉంటుంది. పైకి వెళ్లేకొద్ది గాలి ఒత్తిడి మ‌రింత పెరుగుతుంది. అయితే విమాన కిటికీలు గుండ్రంగా ఉండ‌టం వ‌ల్ల గాలి పిడనాన్ని అన్నింటిపై స‌మానంగా చేరేలా చేస్తుంద‌ట‌. రౌండ్ కిటికీల వ‌ల్ల స్పీడ్ పెరిగి, ప్రమాదాల సంఖ్య త‌గ్గింద‌ని చెబుతున్నారు. అలాగే గాలి ఒత్తిడికి విండోస్ బ్రేక్ అయ్యే అవ‌కాశాలు కూడా త‌క్కువ‌గానే ఉంటాయి. అందుకే 1950 త‌ర్వాత ఫ్లైట్ విండోస్ రౌండ్ గా ఉండేలా డిజైన్ చేశార‌ట‌. ఈ రౌండ్ విండోస్ చూడ‌టానికి కూడా అందంగా క‌నిపిస్త‌న్నాయి.

Also read

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది