పక్షుల గుంపు “V” ఆకారంలోనే ఎందుకు ఎగురుతాయో మీకు తెలుసా…?
birds పక్షులు ఒక క్రమ పద్దతిలో ఆకాశంలో ఎగురుతున్న సమయంలో చూడటానికి రెండు కళ్ళు చాలవు. కొన్ని రకాలు పక్షులు కొన్ని కొన్ని పద్ధతుల్లో ఎరుగుతున్నాయి. వీటిలో ఒకటి గీస్ పక్షులు వీటిని పెద్ద బాతులు అని కూడా పిలుస్తారు.. ఈ లాంటి పక్షులు ఆకాశంలో “V” ఆకారంలో ఎగురుతాయి. అయితే ఈ పక్షాలు “V” ఆకారంలో తిరగటం వెనుక ఒక సైంటిఫిక్ రీజన్ ఉందని తెలుస్తుంది.
ఈ జాతి పక్షులు “V” ఆకారంలో తిరగటం వలన వాటి శక్తి చాలా వరకు ఆదా అవుతుంది. అది ఎలాగంటే ఈ పక్షులు అన్ని కూడా ఒక దాని కంటే ఒకటి కొంచం ఎక్కువ ఎత్తులో ఎగుతుంటాయి. ఇలా ఎగరటం వలన గాలి యొక్క కదిలే వేగాన్ని తగ్గించవచ్చు. దీనితో విండ్ రెసిస్టెన్స్ అని అంటారు.
ఒక పక్షి ఆకాశంలో ఎగురుతున్న సమయంలో ఆ పక్షి రెక్కల నుండి వచ్చే గాలి కూడా ఆ పక్షి రెక్కల మూమెంట్ తో పాటు తిరుగుతూ ఉంటుంది. అర్ధం అయ్యేలా చెప్పాలంటే ఒక పక్షి తన రెక్కలను కిందకి ఆడించినప్పుడు గాలి కిందకి, పైకి ఆడించినప్పుడు పైకి వెళ్తుంది. ఇలా ఎగురుతున్నప్పుడు ఆ పక్షి రెక్కల కదలిక ప్రకారం గాలి సర్కిల్ షేప్ లో తిరుగుతూ ఉంటుంది.
ఈ విధంగా చూసుకుంటే పక్షి ఎగిరినప్పుడు గాలి కిందకి పైకి వెళ్తుంది. రెక్కలు పైకి ఆడించినప్పుడు గాలి పైకి, పక్కకు వెళ్తుంది. కిందకి ఆడించినప్పుడు అది కిందకు వెళ్తుంది.. మనం పైన చెప్పుకున్నట్లు ఒక దాని కింద ఒక పక్షి ఎగురుతుంటాయి కాబట్టి, పై పక్షి గాలి కింద నున్న పక్షి మీదకు వస్తుంది… ఆ గాలి సహాయంతో కింద పక్షి ఈజీ గా పైకి ఎగురుతుంది. సాధారణంగా పక్షి ఎగరడానికి ఉపయోగించే శక్తి కూడా ఇలా చేయటం వలన ఆదా అవుతుంది. వలస పక్షులు ఎక్కువ దూరం ప్రయాణించవల్సి ఉంటుంది కాబట్టి, ఈ పద్దతి వాటికీ ఎంతో మేలు చేస్తాయి.