Chicken | ఫ్రిజ్‌లో పెట్టిన చికెన్ తింటున్నారా.. ఒక్కసారి ఇది చదవండి
Chicken | మనలో చాలా మందికి ఒక సాధారణ అలవాటు ఉంటుంది.చికెన్ కూర లేదా ఫ్రై ఎక్కువగా మిగిలితే, దానిని ఫ్రిజ్‌లో పెట్టి మరుసటి రోజు మళ్లీ వేడి చేసి తినడం. అలా చేయడం వల్ల ఆహారం వృథా కాకుండా ఉంటుంది అని అనుకోవచ్చు. కానీ వైద్య నిపుణుల మాటలు వినితే మాత్రం, ఇది ఆరోగ్యానికి ప్రమాదకరమని అర్థమవుతుంది.
#image_title
చికెన్‌లో ప్రోటీన్ అధికంగా ఉండటం వలన, వండిన తర్వాత అది గది ఉష్ణోగ్రతలో నిల్వ ఉంటే ఒకే కానీ, ఫ్రిజ్‌లో ఉంచితే కొన్ని రకాల ప్రమాదకరమైన బ్యాక్టీరియా వేగంగా పెరుగుతాయి. ముఖ్యంగా సాల్మొనెల్లా , ఇ. కోలై (E. coli) వంటి సూక్ష్మజీవులు చికెన్‌లో తేలికగా వ్యాపిస్తాయి. ఈ బ్యాక్టీరియా ఉత్పత్తి చేసే టాక్సిన్లు మన శరీరంలోకి వెళ్లినప్పుడు ఫుడ్ పాయిజనింగ్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి.
ఫుడ్ పాయిజనింగ్ లక్షణాలు ఇవే..
* వాంతులు
* విరేచనాలు
* కడుపు నొప్పి
* తలనొప్పి
* జ్వరం
* నీరసం, అలసట
ఈ లక్షణాలు చిన్నపిల్లలు, గర్భిణీలు, వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి మరింత ప్రమాదకరంగా మారవచ్చు.ఫ్రిజ్‌లో ఉంచినప్పటికీ, బ్యాక్టీరియా పూర్తిగా చనిపోవు. వాటి పెరుగుదల మాత్రమే నెమ్మదవుతుంది. మళ్లీ వేడి చేసినా, వాటి నుండి వచ్చిన విష పదార్థాలు మిగిలిపోతాయి. ఇవే శరీరానికి హానికరంగా మారతాయి.