Clock : గడియారం ఫోటోలలో 10 గంటల 10 నిమిషాలు అని ఎందుకు ఉంటుందో తెలుసా?

Authored By Anusha V | The Telugu News | Published on: July 2, 2022, 7:00 am

Clock : మనం గూగుల్ లో గడియారం ఫోటోలను వెతికితే ఏ ఫోటో చూసినా అందులో 10 గంటల 10 నిమిషాలు అని టైమింగ్ ఉంటుంది. మనం ఎప్పుడైనా గడియారం లేదా వాచ్ కొనటానికి గడియారం షాపులకు వెళితే అక్కడ ఉండే గడియారాలలో కూడా టైమింగ్ 10 గంటల 10 నిమిషాలు అని చూపిస్తాయి. అయితే ఎందుకు ప్రతి గడియారంలో లేదా వాచ్ లో 10 గంటల 10 నిమిషాలు చూపిస్తుందని ఎప్పుడైనా మీరు ఆలోచన చేశారా? చాలామంది వరకు అయితే దీనిని అంతగా పట్టించుకోరు. అయితే ఇలా ఉండటానికి కూడా కారణం ఉంది. అది ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..అన్ని గడియారాలలో టైమింగ్ 10 గంటల 10 నిమిషాలు అని మాత్రమే ఉండాలని అవసరం లేదు.

ఇంతకుముందు కొన్ని గడియారం కంపెనీలు 8 గంటల 20 నిమిషాలు అని సమయాన్ని సెట్ చేశాయి. ఇప్పుడేమో 10 గంటల 10 నిమిషాలు అనే సమయం ట్రెండ్ గా మారింది. దీని వెనుక శాస్త్రీయపరంగా కొన్ని కారణాలు ఉన్నాయి. ఇలా ఎందుకు ఉంటున్నాయో అని అనేక రకాల పుకార్లు ఉన్నాయి. కొందరేమో ఆ సమయంలో అబ్రహం లింకన్ చనిపోయాడని చెబుతారు. అసలు అబ్రహం లింకన్ మరణించిన సమయం 10 గంటల 15 నిమిషాలు. అలాగే అదే సమయంలో నాగసాకి హిరోషిమా పై బాంబుదాడి జరిగిందని కొందరు చెబుతూ ఉంటారు. ఇవన్నీ వాస్తవానికి నిజం కాదు. ఒక్కొక్కరు ఒక్కో తీరుగా చెబుతూ వచ్చారు. వాస్తవానికి ఈ సమయం వెనక నిజమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం… నిజానికి గడియారాలలో 10 గంటల 10 నిమిషాలు అయినప్పుడు ఆ సమయంలో గడియారంలో V ఆకారం ఏర్పడుతుంది. ఈ V ఆకారం వలనే గడియారంలో 10 గంటల 10 నిమిషాలు ట్రెండ్ గా మారిందని చెబుతారు.

Why on all clocks shows 10-10 time

Why on all clocks shows 10-10 time

ఈ V ఆకారం అంటే విక్టరీ అని అర్థం. విక్టరీ అనగా విజయం అని అర్థం. ఇలా గడియారంలో 10 గంటల 10 నిమిషాలు ఏర్పడినప్పుడు ఈ V ఆకారంలో వచ్చే దానిని విక్టరీగా ఉపయోగిస్తున్నారు అని తెలుస్తోంది. ఇలా అన్ని గడియారాలలో ఈ V ఆకారం వచ్చేటట్లుగా సమయం సెట్ చేయడం వలన గడియారాలు వలన అధిక రాబడి వచ్చి గొప్ప విజయాన్ని సొంతం చేసుకుంటున్నాయి గడియారం కంపెనీలు. అలాగే దీనికి మరొక కారణం కూడా ఉంది. అది ఏమిటంటే వాచ్ లు తయారు చేసిన కంపెనీ బ్రాండ్ పేర్లు గడియారంలో స్పష్టంగా కనబడాలని ఇలా టైమింగ్ సెట్ చేశారు. ఎవరైనా వాచ్ ను కొనే ముందు ముందుగా వారి కళ్ళు రెండు ముళ్ళు మధ్యలో ఉండే కంపెనీ పేరుపై దృష్టి పడుతుంది. ఆ కంపెనీ పేరు తెలుసుకొని మంచిదా కాదా అని కొనుగోలు చేస్తారు. అందుకే గడియారాలలో సమయం ఇలా సెట్ చేశారని కూడా కొందరు ఉంటారు.

Anusha V

No bio available for this author.

  1. "Hyderabad Bomb Threat : బ్రేకింగ్ న్యూస్‌.. హైదరాబాద్‌కు ఉగ్రదాడి బెదిరింపు మెయిల్.. పోలీసుల హై అలర్ట్!"

  2. "Today Horoscope : 23 నవంబర్ 2026 సోమ‌వారం ఈ రోజు మీ రాశి ఫలాలు.. ఈ రాశులకు ధనలాభం..!"

  3. "Samsung Galaxy S25 Ultra : అబ్బా ఏం ఆఫర్.. రూ.1.30 లక్షల ఫోన్ రూ.50 వేలకే?.. ఫ్లిప్‌కార్ట్ భారీ డిస్కౌంట్..!"

  4. "Gold Price Crash : బంగారం ధరలు భారీగా తగ్గినా కొనడానికి వెనుకడుగు.. అసలు 5 కారణాలు ఇవే!"

  5. "8th Pay Commission : కేంద్ర ఉద్యోగులకు డబుల్ గుడ్‌న్యూస్ ? రూ.18 వేల జీతం రూ.65 వేలకు వ‌ర‌కు పెరిగే చాన్స్‌?"

  6. "Peerzadiguda Pulse Polio : పీర్జాదిగూడలో పోలియో చుక్కలు .. ప్రతి చిన్నారికి రక్షణ కల్పించాలి: తవిటి ప్రశాంత్ కుమార్"

  7. "IND A vs PAK A : పాక్ బ్యాటర్‌తో హర్షిత్ రాణా మాటల యుద్ధం.. మైదానంలో హైడ్రామా!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp