Clock : ఇంట్లో గడియారం ఏ దిశగా పెడితే మంచిది… వాస్తు శాస్త్రం ఏం చెబుతుందంటే..!
ప్రధానాంశాలు:
Clock : ఇంట్లో గడియారం ఏ దిశగా పెడితే మంచిది... వాస్తు శాస్త్రం ఏం చెబుతుందంటే..!
Clock : ఇల్లు కట్టిన ప్రతి ఒక్కరు వాస్తు నీ పక్క చూసుకుంటారు. దీని ద్వారా మన ఆర్థిక పరిస్థితి తెలిసిపోతుంది. అలాగే గడియారం పెట్టడానికి కూడా వాస్తు శాస్త్రాన్ని చూసుకోవాలని మీకు తెలుసా .. నేటి కాలంలో టైం చూసుకోవడానికి ప్రతి ఒక్కరు వాచీలు ధరిస్తున్నారు. ఇంకా కొంతమంది ఇంట్లో లేదా బంధువులకు గడియారాలు గిఫ్ట్ గా ఇస్తున్నారు. మరి ఈ గడియారం ఏ దిక్కున ఉంటే శుభప్రదం.? అలాగే ఏ రంగు గడియారాలు ఇంట్లో పెట్టుకోవాలి..? ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. వాస్తు శాస్త్రం ప్రకారం గడియారం అనేది ఇంటి ఆర్థిక స్థితితో ముడిపడి ఉంటుంది. ఏ రంగు గడియారం దాని ఆకృతి ఏమిటి అనే విషయానికి ప్రాముఖ్యత ఉంటుంది. ఒక్కవేళ మీరు కుడా మీ ఇంటి గోడలపై కొత్త గడియారాన్ని ఏర్పాటు చేసుకోవాలంటే వాస్తు శాస్త్రం ప్రకారం ఏ దిశలో ఉంచాలో వాటికి కొన్ని నియమాలు ఉన్నాయి. అవేంటంటే…
Clock గడియారం ఏ దిశలో ఉంచాలి
వాస్తు శాస్త్రంలో గడియారాన్ని తూర్పు, ఉత్తరం, పడమర, దిశలో పెట్టడం శుభప్రదం. అదేవిధంగా గడియారాన్ని దక్షిణ దిశలో పెట్టకూడదు. ఇలా పెట్టడం వలన డబ్బుకు సంబంధించిన సమస్యలు వస్తాయి. కాబట్టి గడియారాన్ని దక్షిణ దిశలో ఉంచకపోవడం మంచిది. అలాగే గోడ గడియారాన్ని ఎక్కువగా తూర్పు పడమర దిశల్లోనే ఉంచాలి. ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం అవసరం. అయితే ఉత్తరం తూర్పు దిశల్లో స్థలం లేనప్పుడు పశ్చిమ దిశలో ఉంచాలి. తూర్పు మరియు ఉత్తర దిశలో గడియారాన్ని ఉంచడం అత్యంత శుభప్రదంగా పరిగణించబడుతుంది. తూర్పు ఉత్తర దిశలో ఉన్నట్లయితే ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది.
Clock ఇంట్లో గడియారం ఎక్కడ పెట్టకూడదంటే
చాలామంది గడియారాన్ని ఇంటి మెయిన్ డోర్ పై ఉంచుతారు. ఇది అశుభమైనదిగా పరిగణించబడుతుంది. అలాగే ఇంటిలోని తలుపు పైన కూడా గడియారాన్ని ఉంచకూడదు. అలాగే నిద్రించే మంచం గోడపైన కూడా గడియారాన్ని ఉంచకూడదు. ఇలా ఉంటే అది ఇంట్లో హానిని కలిగిస్తుంది అని గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా ఇది అశుభం.
ఈ విషయాలను దృష్టిలో ఉంచుకోవడం ముఖ్యం..
ఇంట్లో గడియారం ఉంటే అది నిరంతరం పని చేయడం ముఖ్యం. ఒక్కవేళ గడియారం తిరగడం ఆగిపోయినట్లు ఉంటే అది ఆశుభం. నిరంతరం పని చేసున్న గడియారం శుభ సంకేతంగా పరిగణించబడుతుంది. ఇంట్లో గడియారం నిరంతరం నడవడం చాలా అవసరం. ఒకవేళ గడియారం తిరగడం ఆగిపోతే వెంటనే పన్ని చేసేలా చూడాలి. లేదా అక్కడ నుండి తీసేయాలి. అదేవిధంగా గడియారం విరిగిపోయిన పగిలినా లేదా దెబ్బతిన్నా పగిలిన గాజు గడియారాలు ఇంట్లో ఉంచకూడదు.
గోడ గడియారం రంగు ఎలా ఉండాలి?
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో అమర్చుకునే గడియారం రంగుకు ప్రాముఖ్యత ఉంటుంది. ఏ రంగు గడియారమైనా సరే ఎటువంటి హాని కలిగించకుండా ఉండడం కోసం ముదురు ఆకుపచ్చ గడియారం లేదా లేత బూడిద రంగు, గోధుమ రంగు గడియారాన్ని తీసుకోవాలి. అలాగే తెలుపు, ఆకాశ నీలం, లేత ఆకుపచ్చ, క్రీమ్ రంగు వాచ్ లను ధరించవచ్చు.