Chandrababu – Pawan Kalyan : మొహమాటం లేకుండా విడిపోయిన చంద్రబాబు – పవన్ కళ్యాణ్.. టీడీపీ, జనసేన విడాకులు..!
Chandrababu – Pawan Kalyan : ఏపీలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు. అవును.. ప్రస్తుతం ఏపీ రాజకీయాలు అలాగే ఉన్నాయి. నిన్నా మొన్నటి వరకు ఏపీలో జనసేన, టీడీపీ రెండూ రాసుకు పూసుకు తిరిగాయి. ఇప్పుడు ఏమైందో మళ్లీ రెండు పార్టీలు రెండు దిక్కుల వైపు వెళ్లినట్టు తెలుస్తోంది. ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో వైసీపీ పార్టీని ఓడించేందుకు ప్రతిపక్షాలన్నీ కలిసి రావాలని పిలుపునిచ్చాయి. కానీ.. అది రెండు మూడు రోజులకే పరిమితం అయినట్టు తెలుస్తోంది. నిజానికి పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయాడు.
అయినా కూడా ఆయనకున్న పాపులారిటీ వేరు. ఒక సినిమా స్టార్ కావడం వల్ల ఆయనకు రాష్ట్ర వ్యాప్తంగా క్రేజ్ ఉంది. అలాగే.. వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించే నాయకుల్లో పవన్ కళ్యాణ్ ముందు ప్లేస్ లో ఉంటారు. కానీ.. ఈ మధ్య పవన్ కళ్యాణ్ తనకున్న పాపులారిటీని తానే కావాలని తగ్గించుకున్నట్టు అనిపిస్తోంది. మరోవైపు టీడీపీతో పొత్తుపై కూడా పవన్ ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. ఇటీవల పవన్ కళ్యాణ్ శ్రీకాకుళంలో మాట్లాడిన ఘటన తర్వాత చంద్రబాబు స్వయంగా పవన్ ను కలిశారు. రెండు పార్టీలం కలిసి ఏపీ ప్రభుత్వంపై పోరును స్టార్ట్ చేద్దాం అన్నారు.
Chandrababu – Pawan Kalyan : పొత్తు ఉందా? లేదా?
రెండు పార్టీల పొత్తు ఇక ఖాయం అయినట్టే అని అంతా అనుకున్నారు. ఇంతలో ఎల్లో మీడియాలో చంద్రబాబును ఓడించడం కోసం పవన్ కళ్యాణ్ కు తెలంగాణ సీఎం కేసీఆర్ కొంత డబ్బు ముట్టజెప్పారు అంటూ వార్తలు రావడంతో.. అవి కావాలని చంద్రబాబే రాయించారని వార్తలు రావడంతో.. పవన్ కళ్యాణ్ కు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇటీవల చంద్రబాబు సభలకు పర్మిషన్ ఇవ్వకపోతే మండిపడ్డారు పవన్ కళ్యాణ్. కానీ.. తాజాగా జరిగిన గన్నవరం ఘటనపై మాత్రం పవన్ కళ్యాణ్ స్పందించలేదు.