Chandrababu – Pawan Kalyan : సీట్ల షేరింగ్ పై చంద్రబాబు బిగ్ కండిషన్…అడ్డంగా బుక్ అయిన పవన్ కళ్యాణ్…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chandrababu – Pawan Kalyan : సీట్ల షేరింగ్ పై చంద్రబాబు బిగ్ కండిషన్…అడ్డంగా బుక్ అయిన పవన్ కళ్యాణ్…!!

 Authored By aruna | The Telugu News | Updated on :7 February 2024,1:00 pm

Chandrababu – Pawan Kalyan : జనసేన మరియు తెలుగుదేశం పార్టీ ఈ రెండు పార్టీలు కూడా పొత్తులో వారి యొక్క సీట్లు షేరింగ్ లో భాగంగా కింద పైన పడుతూ ఎవరికి ఎన్ని సీట్లు కావాలి అనే విషయంపై చర్చలు జరుపుతున్నారు అన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే దీనిలో భాగంగా చంద్రబాబు నాయుడు పెట్టిన ఒక మెయిన్ కండిషన్ గురించి పవన్ కళ్యాణ్ కు చంద్రబాబు నాయుడు విషయంపై ఈరోజు మనం మాట్లాడుకుందాం. అయితే ప్రస్తుతం ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు వంటి నాయకుడు గెలవడం అనేది అత్యంత ముఖ్యమైన విషయం. ఎన్నికల్లో కచ్చితంగా చంద్రబాబుకి గెలిసి తిరాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు వయస్సు పరంగా చూస్తే 2029 ఎన్నికల నాటికి ఆయన ఇప్పుడున్నంత యాక్టివ్ గా ఉంటారో లేరో చెప్పడం కష్టమే. కాబట్టి ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి చావో రేవో అనే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ యొక్క సపోర్టర్లు అలాగే పవన్ కళ్యాణ్ యొక్క సామాజిక వర్గ ఓట్లు ఎలాగైతే 2019లో విడిపోయి చంద్రబాబు నాయుడుకి 30 – 40 నియోజకవర్గాలలో దెబ్బ తగిలిందో ఆ రకమైనటువంటి దెబ్బ ఈసారి తగలకూడదు అనే ఉద్దేశంతోనే చంద్రబాబు పొత్తుని అంగీకరించారని చెప్పాలి. ఇక ఈ పొత్తులో పవన్ కళ్యాణ్ కి ఉన్నటువంటి లాభాలు ఏంటి అంటే గెలుపు అని చెప్పాలి. ఒక ఎమ్మెల్యేగా తాను గెలవాలనుకునే గెలుపు మాత్రం ఈ పరిస్థితులో సాధ్యమవుతుంది.

ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలవాలంటే పొత్తులోనైతేనే అది సాధ్యమవుతుంది అని చెప్పాలి. ఇక ఈ పొత్తులో తెలుగుదేశం పార్టీ గెలిచిన గెలవకపోయిన పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలవడం అయితే సాధ్యమవుతుంది. లేకపోతే ఇప్పుడు అధికారంలో ఉన్న వైసిపి పార్టీ చాలా స్ట్రాంగ్ అభ్యర్థిని నిలుచోబెట్టి ఏవైనా జిమ్మిక్కులు చేస్తే తప్ప పవన్ కళ్యాణ్ కు ఇబ్బంది ఉండదు. ఇక ఈ పొత్తులో సీట్ల పంపకాలపై వివిధ రకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ ను సపోర్ట్ చేసేవారు పవన్ కళ్యాణ్ సామాజిక వర్గాలు అందరూ కూడా దాదాపు జనసేనకు 60 సీట్లు కేటాయించాలని కోరుతున్నారు. అయితే గత ఎలక్షన్స్ లో చూసినట్లయితే పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోయారు. ఒకే ఒక చోట గెలుపొందారు. ఇలాంటి తరుణంలో పవన్ కళ్యాణ్ కనీసం ఒక 40 సీట్లున్న ఇవ్వండి చాలు అని చంద్రబాబును కోరుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే చంద్రబాబు నాయుడు గారు మొత్తం అన్ని లెక్కలు వేసుకున్న తర్వాత ఒక 20 సీట్లు మాత్రమే ఇచ్చే పరిస్థితి ఉంది అని చెప్పినట్లుగా సమాచారం. లేదు జనసేన పార్టీ గట్టిగా మాట్లాడితే ఎలక్షన్స్ కల్లా 25 సీట్లు మాత్రమే ఇవ్వగలం అని చెప్పినట్లుగా సమాచారం.ఇక చంద్రబాబు వైఖరి చూస్తుంటే 150 స్థానాలలో వారే పోటీ చేయాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ చాలా పెద్ద పార్టీ.ఇక మాకు ఉన్నటువంటి ఓటు షేర్ కూడా దాదాపు 48 కి అటు ఇటుగా ఉంది.

మీది ఏడు శాతమే ఉంది. ఈ రెండిటిని పోల్చి చూస్తే మీ స్థాయికి ఆ సీట్లు కంటే ఎక్కువ ఇవ్వలేము అని చంద్రబాబు తేల్చి చెప్పినట్లుగా సమాచారం. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఈ నెంబర్ ను 38 స్థానాల వరకు తీసుకెళ్లాలని ప్రయత్నించినట్లు తెలుస్తోంది. అలాగే పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ కు జనసేన పార్టీకి సరైన సీట్లు ఇవ్వడం జరిగింది అని ప్రజలు అనుకుంటేనే తెలుగుదేశం పార్టీ నిలబడగలుగుతుంది అనే కథనాలు కూడా వినపడుతున్నారు . ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కు ఒక కండిషన్ పెట్టినట్లు సమాచారం.అదేంటంటే జనసేనకు 40 సీట్లు ఇచ్చిన తరుణంలో 8 నుండి 10 సీట్లు ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకులు ఉంటారో వారు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి జనసేనలో చేరుతారని , ఇక వారిని జనసేన నుండి పోటీ చేయించాల్సిందిగా చంద్రబాబు కండిషన్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇక ఈ కండిషన్ కు పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటే కచ్చితంగా 40 సీట్లు ఇవ్వడానికి చంద్రబాబు రెడీగా ఉన్నట్లు సమాచారం.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది