Chandrababu – Pawan Kalyan : పవన్ కళ్యాణ్ విజిటింగ్ అయింది.. మరి ఇక మిగిలింది చంద్రబాబుదే.. అదెప్పుడంటే..!
Chandrababu – Pawan Kalyan : వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో తీవ్ర వివాదాస్పదమైన అంశం.. రుషికొండ ప్యాలెస్ అన్న విషయం అందరికి తెలిసిందే. విశాఖపట్నంలో సముద్ర తీరాన ఉన్న బీచ్ ఒడ్డున ఉన్న రుషికొండకు నున్నగా గుండు కొట్టినట్టు కొట్టి వాటిపైన పర్యాటక రిసార్టుల ముసుగులో జగన్ ప్యాలెస్ నిర్మించుకున్నట్టు పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీని కోసం ప్రభుత్వం దాదాపు రూ.550 కోట్ల ఖర్చు చేసిందనే ఆరోపణలున్నాయి. చివరకు జగన్ విశాఖ నుంచి పరిపాలించడానికి […]
Chandrababu – Pawan Kalyan : వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో తీవ్ర వివాదాస్పదమైన అంశం.. రుషికొండ ప్యాలెస్ అన్న విషయం అందరికి తెలిసిందే. విశాఖపట్నంలో సముద్ర తీరాన ఉన్న బీచ్ ఒడ్డున ఉన్న రుషికొండకు నున్నగా గుండు కొట్టినట్టు కొట్టి వాటిపైన పర్యాటక రిసార్టుల ముసుగులో జగన్ ప్యాలెస్ నిర్మించుకున్నట్టు పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీని కోసం ప్రభుత్వం దాదాపు రూ.550 కోట్ల ఖర్చు చేసిందనే ఆరోపణలున్నాయి. చివరకు జగన్ విశాఖ నుంచి పరిపాలించడానికి రుషికొండపై నిర్మించిన ఈ భవనాలయితే అనుకూలంగా ఉంటాయని.. ఐఏఎస్ అధికారులతో నియమించిన త్రీమెన్ కమిటీతో చెప్పించిందనే విమర్శలున్నాయి.
Chandrababu – Pawan Kalyan : చంద్రబాబు ఎప్పుడో..
అయితే పవన్ కళ్యాణ్ రీసెంట్‌గా రుషికొండ ప్యాలెస్‌లో ప్రత్యక్షం అయ్యారు. విజయనగరం మీద నుంచి విశాఖ బీచ్ రోడ్డుకు డిప్యూటీ సీఎం వాహనాలు టర్న్ అయ్యాయి. అలా అందరినీ ఆశ్చర్యపరుస్తూ రుషికొండ భవనాల వద్ద పవన్ ప్రత్యక్షం అయ్యారు. అక్కడ ఉన్న పరిస్థితులను గమనించారు. అక్కడ పనిచేస్తున్న కార్మికులతో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రుషికొండ పై నుంచి విశాఖ బీచ్ అందాలను ఆయన చూశారు. వాటికి సంబంధించిన ఫోటోలను ఆయన తీసుకున్నారు. పవన్ ని నాడు రుషికొండని చూడకుండా వైసీపీ ప్రభుత్వం అడ్డుకుంది. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో రుషికొండ పైకి దర్జాగా వచ్చారు. అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికి తోడ్కొని వెళ్ళారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి నారా లోకేష్ మాత్రం ఇప్పటికీ రుషికొండని విజిట్ చేయలేదు. చూడలేదు. కూటమి ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలు పూర్తి అయినా రుషికొండ మీద ప్రభుత్వం ఏ రకమైన నిర్ణయమూ తీసుకోలేదు. తాజాగా విశాఖ వచ్చిన మంత్రి నారా లోకేష్ అయితే రుషికొండ పైన ఉన్న భవనాల నిర్మాణానికి ఏకంగా ఆర్భాటాలు చేస్తూ ఏడు వందల కోట్లు ఖర్చు చేసిందని లెక్క చెప్పారు. ఇపుడు దానిని ఏ విధంగా ఉపయోగించాలో మీడియావే సలహా ఇవ్వాలని కోరారు. పలుమార్లు నారా లోకేష్, చంద్రబాబు విశాఖకి వచ్చిన కూడా ఏనాడు విజిట్ చేసింది లేదు. అయితే చంద్రబాబు తొందరలోనే ఆ పని చేయనున్నట్టు తెలుస్తుంది.