YS Jagan : రాష్ట్రం అంతా ఓకే.. బట్ అక్కడ మాత్రం వైఎస్ జగన్ కి సరైన క్యాండేట్ దొరకట్లేదు
YS Jagan : ఏపీలో ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. అయినప్పటికీ ఇప్పటి నుంచే ఏ నియోజకవర్గంలో ఏ క్యాండిడేట్ ను బరిలోకి దించాలని ప్రధాన పార్టీలన్నీ ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అయితే సిట్టింగ్స్ అందరికీ టికెట్స్ అని ముందే ప్రకటించేశారు. మరోవైపు అధికార పార్టీ వైసీపీ కూడా ఎవరికి సీట్లు ఇవ్వాలని అనే దానిపై తర్జన భర్జన పడుతోంది. సిట్టింగ్స్ అందరికీ ఇవ్వాలా? లేక కొందరిని మార్చాలా? అనే మీమాంశలో వైసీపీ ఉంది. అయితే.. దాదాపుగా అన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను ఫిక్స్ చేసే దిశగా వైఎస్ జగన్ ముందడుగు వేయగలుగుతున్నారు.
కానీ.. ఒక్క సీటు విషయంలో మాత్రం జగన్ కు అనుకున్న అభ్యర్థి దొరకడం లేదు. టీడీపీని అక్కడ మాత్రం జగన్ ఓడించలేకపోతున్నాడు. అదే విజయవాడ ఎంపీ సీటు. విజయవాడలో గెలవడం అంటే మామూలు విషయం కాదు. అది టీడీపీకి కంచుకోట. అందులోనూ అక్కడ బాగా ఖర్చు పెట్టాలి. వందల కోట్లు ఖర్చు పెట్టినా గెలుస్తారా? అనేది డౌటే. అందుకే అక్కడ పోటీ చేయాలంటే చాలామంది వెనకడుగు వేస్తున్నారు. ఇక్కడ 2014 లో వైసీపీ నుంచి పోటీ చేసిన కోనేరు ప్రసాద్ ఓడిపోయారు.
YS Jagan : 2014, 2019 ఎన్నికల్లో ఓడిపోయిన వైసీపీ
2019 ఎన్నికల్లో పోటీ చేసిన పుట్లూరు ప్రసాద్ కూడా ఓడిపోయారు. 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి కేశినేని నాని గెలిచారు. 2014, 2019 ఎన్నికల్లో పోటీ చేసిన వాళ్లంతా వ్యాపారవేత్తలే. అయినప్పటికీ.. వైసీపీ అభ్యర్థులు గెలవలేకపోయారు. అయితే.. ఈసారి టీడీపీ నుంచి కేశినేని నాని పోటీ చేస్తారో లేదో తెలియదు. ఒకవేళ కేశినేని పోటీ చేస్తారో చేయరో తెలియదు కానీ.. వైసీపీ నుంచి ఎవరు పోటీ చేస్తారు. ఎవరు డేర్ చేస్తారు. ఎవరు అంత ఖర్చు చేస్తారు. ఈసారి కొడాలి నాని పేరు వినిపిస్తోంది కానీ.. ఆయన తన సొంత నియోజకవర్గం గుడివాడను వదిలేసి విజయవాడలో ఎంపీగా పోటీ చేస్తారా? చేసినా గెలుస్తారా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.